హైదరాబాద్: వరుసగా రెండు సూపర్ సిరీస్‌లు నెగ్గి మంచి జోరుమీదున్న భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. గురువారం తాజాగా విడుదల చేసిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ మూడు స్థానాలు ఎగ బాకి ఎనిమిదో ర్యాంక్‌లో నిలిచాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు 11వ స్థానంలో ఉన్న అతడు ప్రస్తుతం ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఇండోనేసియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపె న్ సాధించిన కిడాంబి ఖాతాలో 58,583 పాయింట్లు ఉన్నాయి. పురుషుల సింగిల్స్‌లో టాప్ 10లో ఉన్న ఏకైక భారత షట్లర్ శ్రీకాంతే కావడం విశేషం.
