For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిప్యూటీ కలెక్టరుగా కిదాంబి శ్రీకాంత్

Srikanth appointed Group I officer

హైదరాబాద్: బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిదాంబి శ్రీకాంత్‌కు డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 30 రోజుల వ్యవధిలో ఆయన ఉద్యోగంలో చేరాలని, భూ పరిపాలనా ప్రధాన కమిషనరేట్‌ (సీసీఎల్‌ఏ)లో రిపోర్టు చేయాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ బుధవారం జారీ చేసిన ఉత్తర్వు(జీఓ 136)లో పేర్కొన్నారు.

నిరుడు 4 సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు నెగ్గిన శ్రీకాంత్‌ చరిత్ర సృష్టించాడు. గత ఏడాది జూన్‌ 26న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కిదాంబి సన్మానసభలో పాల్గొన్న సీఎం అతడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

ఈ మేరకు తనను గ్రూప్‌-1 పోస్టులో నియమించాలని జూలై 30న శ్రీకాంత్‌ ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాడు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సర్కారు అతడిని క్రీడల కోటాలో గ్రూప్‌-1 అధికారిగా నియమించేందుకు చట్టాన్ని సవరించింది.

ఆయన ఇచ్చిన హామీ మేరకు క్రీడా కోటా ద్వారా ప్రభుత్వ ఉత్తర్వు నంబరు 136ను జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Story first published: Thursday, March 22, 2018, 12:26 [IST]
Other articles published on Mar 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+