Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఛాంపియన్‌షిప్: క్వార్టర్ ఫైనల్లోకి సైనా, కశ్యప్ సంచలనం

గాంగ్జౌ: చైనాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. గ్యాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో గురువారం ఉదయం జరిగిన ప్రీక్వార్టర్ పోరులో థాయ్‌లాండుకు చెందిన క్రీడాకారిణి పోర్నిటివ్ పైన సైనా 21-18, 16-21, 21-14తో విజయం స్ధించింది.

తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ హవా కూడా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కొనసాగుతోంది. కశ్యప్ తన కన్నా ముందున్న ర్యాంకర్‌కు షాక్ ఇచ్చాడు. ప్రీక్వార్టర్ ఫైనల్ పోరులో పదమూడో సీడ్ కశ్యప్ హాంకాంగ్‌కు చెందిన ఆరో సీడ్ యూన్ హ్యూ పైన 21-13, 21-16తో సంచలన విజయం సాధించాడు.

Parupalli Kashyap and Saina Nehwal

కాగా, సైనా నెహ్వాల్, పివి సింధు, పారుపల్లి కశ్యప్‌లు బుధవారం జరిగిన పోటీలు ప్రి క్వార్టర్స్‌లో ప్రవేశించారు. నిన్న సైనా రెండో రౌండ్‌లో ఓల్గా గొలవనొవ (రష్యా)పై సులువైన విజయం సాధించగా.. సింధు తనకంటే తక్కువ ర్యాంక్ క్రీడాకారిణి కయోరి ఇమబెపు (జపాన్)పై చెమటోడ్చి నెగ్గింది. పారుపల్లి కశ్యప్ రెండో రౌండ్ తొలి గేమ్‌లో 14-5తో ఉన్న దశలో ప్రత్యర్ధి పెట్ర కౌకల్ రిటైర్డ్ హర్ట్‌గా వెను దిరగడంతో ముందంజ వేశాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+