టెన్నిస్ క్రీడాకారిణి పివి సింధును అభినందిస్తున్న మంత్రి వట్టి వసంతకుమార్..

క్రీడ, యువజన సర్వీసుల మంత్రి వట్టి వసంతకుమార్‌తో పివి సింధు

వట్టి వసంత కుమార్‌ను సచివాలయంలో కలిసి పివి సింధు

మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్ట్ టోర్నమెంట్ విజేత పివి సింధు
హైదరాబాద్: మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ మహిళా టైటిల్‌ను కైవసం చేసుకున్న టెన్నిస్ క్రీడాకారిణి పివి సింధును క్రీడా యువజన సర్వీసుల మంత్రి వట్టి వసంతకుమార్ అభినందించారు. పివి సింధు బుధవారం సచివాలయానికి వచ్చారు. ప్రభుత్వ కార్యదర్శి లవ్ అగర్వాల్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ టిఆర్‌కె రావు, అర్జున అవార్డు గ్రహీత పివి రమణ, చాముండేశ్వరి నాథ్ ఆమె వెంట ఉన్నారు.
పివి సింధు మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్‌ను ఇటీవల కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టెన్నిస్ సింగిల్స్ సైనా నెహ్వాల్ తర్వాత రాష్ట్రానికి చెందిన పివి సింధు అంతర్జాతీయ స్థాయిలో తన సత్తాను చాటుతోంది.
మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్ ఫైనల్లో ఆమె సింగపూర్ షట్లర్ జువాన్‌జుపై 21 - 17, 17-21, 21-19 స్కోరుతో విజయం సాధించింది. ఈ టైటిల్‌ను సింధు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. హోరాహోరీ జరిగిన మ్యాచులో సింధు విజయం సాధించింది. ఇరువురి మధ్య పోరు గంటా 11 నిమిషాల పాటు సాగింది.