Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్వార్టర్ ఫైనల్లోకి సైనా, ఇక నుంచి కశ్యప్‌కు కష్టమే

Saina Nehwal
లండన్: భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ జోరు కొనసాగుతోంది. ఒలింపిక్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్\ లో హైదరాబాదీ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారమిక్కడ జరిగిన ప్రీ క్వార్టర్స్ పోరులో ఐదోసీడ్ సైనా 21-14, 21-16తో 20వ ర్యాంకర్ జీ యావో (నెదర్లాండ్స్)ను వరుస గేముల్లో ఓడించి, క్వార్టర్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో సైనా సత్తాకు యావో నిలవలేకపోయింది. కాగా, క్వార్టర్స్‌లో సైనా టినె బాన్ (డెన్మార్క్) లేదా సయాకా సాటో (జపాన్)తో తలపడే అవకాశముంది.

అంతకుముందు మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ బీజింగ్ ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించింది. శ్రీలంక ఆటగాడు నిలుక కరుణరత్నెతో బుధవారమిక్కడ జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో కశ్యప్ 21-14, 15-21, 21-9తో మూడు గేమ్‌లపాటు పోరాడి గెలిచాడు. 66 ని మిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో 21వ ర్యాంకర్ కశ్యప్‌కు.. 27వ ర్యాంకర్ కరుణరత్నె నుంచి గట్టి పోటీ ఎదురైంది. కాగా, కశ్యప్ సెమీస్‌కు చేరాలంటే టాప్‌సీడ్, ప్రపంచ రెండోసీడ్ లీ చాంగ్ వీ (మలేసియా)పై విజయం సాధించాల్సి ఉంది.

వరుస విజయాలతో ఒలింపిక్ క్వార్టర్ పైనల్‌కు దూసుకెళ్లి రికార్డు నెలకొల్పిన కశ్య ప్.. సెమీస్ చేరడం మాత్రం కష్టంగా కనిపిస్తోంది. కశ్యప్‌కు క్వార్టర్స్‌లో వరల్డ్ నెంబర్‌వన్, టాప్ సీడ్ లీ చాంగ్ వీ (మలేసియా) రూపంలో పెను సవాల్ ఎదురు కానుంది. లీ చాంగ్‌పై కశ్యప్‌కు మెరుగైన రికార్డు లేకపోవడం, జనవరిలో జరిగిన డెన్మార్క్ ఓపెన్‌లో కశ్యప్ వరుస గేముల్లో చాంగ్ చేతిలో ఓడిపోవడం ప్రతికూలాంశాలుగా కనిపిస్తున్నాయి. అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కశ్యప్ తనదైన రోజున పెను సంచలనాలు సృష్టించగలడు.

ఇటీవల ఇండోనేసియా సూపర్ సిరీస్‌లో మూడో ర్యాంకర్ చెన్ లాంగ్ (ఇండోనేసియా)కు షాకిచ్చిన కశ్యప్ ఇది నిరూపించాడు కూడా. కాగా, చీలమండ గాయంతో 10 వారాలు బ్యాడ్మింటన్‌కు దూరంగా ఉన్న చాంగ్ వీ.. తొలిమ్యాచ్‌లో ప్రపంచ 45వ ర్యాంకర్ చేతిలో మూడు సెట్లపాటు పోరాడి గెలిచాడు. అయితే కశ్యప్ ఈ గండాన్ని అధిగమించాలంటే అసాధారణంగా రాణించక తప్పదు.

హాకీలో మరో అపజయం

ఎనిమిదిసార్లు ఒలింపిక్ చాంపియన్ భారత్‌కు హాకీ లో మరో ఓటమి ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 1-3తో చిత్తయి వరుసగా రెండో ఓటమి తో నా కౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. రెండో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి న సందీప్ సింగ్ భారత్‌కు శుభారంభం అందించినా.. అనంతరం రక్షణ పంక్తి వైఫల్యంతో భారత్ మూల్యం చెల్లించుకుంది. 12వ నిమిషంలో కివీస్ ఆటగాడు ఆండ్రూ హేవార్డ్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు. ఫిలిప్ బర్రోస్ (24వ), నికోలస్ విల్సన్ (29వ) చెరో గోల్ అందించి కివీస్ ఆధిక్యాన్ని 3-1కి పెంచారు. రెండో అర్ధ భాగంలో ఇరు జట్లూ గోల్ చేయడంలో విఫలమయ్యాయి.

ఆర్చరీ నుంచి అవుట్..

ఆర్చరీలో భారత కథ సమాప్తమైంది. కొండంత ఆశల భారాన్ని మోసుకెళ్లిన భారత ఆశాదీపం, ప్రపంచ నెంబర్‌వన్ దీపికా కుమారి కూడా వ్యక్తిగత విభాగంలో తీవ్రంగా నిరాశను మిగిల్చింది. మహిళల వ్యక్తిగత విభాగంలో అమీ ఒలీవర్ (బ్రిటన్)తో జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో దీపిక 2-6తో పరాజయం పాలై ఇంటిదారిపట్టింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+