Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నెంబర్ వన్ 'చైనా'కు సైనా చెక్: డెన్మార్క్ ఓపెన్లో ఫైనల్లోకి

Saina Nehwal
డెన్మార్క్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ అద్భుత ప్రతిభ కనబరిచింది. శనివారం జరిగిన డెన్మార్క్ ఓపెన్ టోర్నీలో సైనా చైనా గోడను నిలువరించింది. నెంబర్ వన్ క్రీడాకారిణి యిహాన్ వాంగ్‌ను కంగు తినిపించింది. బ్యాడ్మింటన్‌లో ఇన్నాళ్లూ చైనా పేరుతో చెబితే అందరూ భయపడేవారు. ఇప్పుడు మన సైనా వారికి ముచ్చెమటలు పోయిస్తోంది.

శనివారం జరిగిన ఆటలో సైనా నెహ్వాల్ చైనా క్రీడాకారిణి, నెంబర్ వన్ ర్యాంకర్ యిహాన్ వాంగ్‌ను 21-12, 12-7తో మట్టికరిపించింది. ఫైనల్‌కు చేరిన సైనా డెన్మార్క్ ఓపెన్ నెగ్గెందుకు మరొక్క అడుగు దూరంలోనే ఉంది. ఫైనల్‌లో సైనా నెహ్వాల్‌ ఆరో సీడ్ జులియన్ షెంక్(జర్మనీ)తో తలపడనుంది.

అత్యున్నత ప్రతిభ కనబర్చి చైనా నెంబర్ వన్‌ను ఓడించిన సైనా ఆరో నెంబర్ ర్యాంకర్‌పై ఖచ్చితంగా గెలిచి డెన్మార్క్ ఓపెన్ సిరీస్‌ను దక్కించుకుంటుందని అందరూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్స్ అనంతరం సుదీర్ఘంగా విశ్రాంతి తీసుకున్నా తనలో ఏ మాత్రం జోరు తగ్గలేదని సైనా నిరూపించింది.

తొలి ఆటను నెగ్గిన సైనా రెండో ఆటలోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నపుడు.. యిహాన్ మోకాలి గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగింది. దీంతో అంపైర్లు సైనాను విజేతగా ప్రకటించారు. తొలి గేమ్‌ను సైనా తడబడుతూ ప్రారంభించింది. 0-5తో వెనుక బడిన తరుణంలో వరుసగా ఆరు పాయింట్లు గెలిచింది. అనంతరం మరోసారి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 12-6తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఇక అక్కడి నుంచి యిహాన్‌కు ఏమాత్రం అవకాశమివ్వకుండా, కచ్చితమైన స్మాష్‌లతో అదరగొట్టి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో కూడా సైనా జోరు కొనసాగించింది. క్రాస్ కోర్టు షాట్లతో ప్రత్యర్థిని కోర్టు నలుమూలలకు పరుగులు పెట్టించింది. 11-6తో సైనా ఆధిక్యంలో ఉండగా.. యిహాన్ గాయం కారణంగా కోర్టులో అసౌకర్యంగా కదిలింది. ఆ తర్వాత రెండు పాయింట్లు వరకూ మాత్రమే యిహాన్ కోర్టులో నిలబడగలిగింది. 7-12తో వెనుకబడిన తరుణంలో టోర్నీ డాక్టర్ సలహాపై యిహాన్ మ్యాచ్ నుంచి తప్పుకుంది.

కాగా సైనా నెహ్వాల్ ఇప్పటి వరకు జర్మనీకి చెందిన షెంక్ పైన ఐదుసార్లు గెలిచి మూడుసార్లు ఓడింది. ఆమెతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఓడినా అంతకుముందు వరుసగా నాలుగు విజయాలు సాధించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+