
స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నిష్క్రమించినా శ్రీకాంత్ శనివారం పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో విజయం సాధించాడు. థాయ్‌లాండ్‌కు చెందిన థామ్సిన్ సితికుమ్‌తో శనివారం జరిగిన సెమీ ఫైనల్లో 21-14, 21-18తో గెలుపొంది టైటిల్‌తో మరో అడుగు దూరంలో నిలిచిన శ్రీకాంత్ ఈ రోజు బున్సాక్ పైన గెలుపొంది టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
11 ఏళ్ల తర్వాత సెరెనా
మరోవైపు అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ 11 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో మెరిసింది. టైటిల్‌ను రెండోసారి సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్‌వన్ సెరెనా విలియమ్స్ 6-4, 6-4తో డిఫెండింగ్ చాంపియన్ మరియా షరపోవాను త్తుచేసింది.
రష్యా అందాల భామకు వరుసగా పదో ఓటమి రుచి చూపించి కెరీర్‌లో 16వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సొంతం చేసుకుంది. ఓపెన్ శకంలో (1968 తర్వాత) అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన జాబితాలో సెరెనా (16)ది నాలుగో స్థానం. స్టెఫీగ్రాఫ్ (22), క్రిస్ ఎవర్ట్ (18), మార్టినా నవ్రతిలోవా (18) ముందు వరుసలో ఉన్నారు. గత నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల్లో సెరెనా మూడింట్లో విజయకేతనం ఎగురవేయడం విశేషం.