
హైదరాబాద్‌కు చెందిన భారత షట్లర్ సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్‌లో శుభారంభం చేసిన విషయం తెలిసిందే. థాయ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమికి జువాన్ గుపై ప్రతీకారం తీర్చుకుంది. 21-14, 23-21తో వరుస గేముల్లో గెలిచి రెండో రౌండ్లో ప్రవేశించింది.
అయితే, థాయ్‌లాండ్ ఓపెన్ చాంపియన్ శ్రీకాంత్, గురుసాయిదత్, కశ్యప్‌లకు నిరాశ ఎదురైంది. శ్రీకాంత్ ఇటీవలే థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీని గెలుచుకున్న విషయం తెలిసిందే. థాయ్‌లాండ్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో సైనా నెహ్వాల్‌కు నిరాశే మిగిలింది.
సింగపూర్ ఓపెన్ టోర్నమెంట్‌పై సైనా నెహ్వాల్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ టోర్నమెంట్‌లో విజయం సాధించి తిరిగి ఫామ్‌లోకి రావాలని అనుకుంటోంది.