Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తెలుగుతేజం సింధు సంచలనం: ఇంటికి కశ్యప్

PV Sindhu
చాంగ్‌హో: భారత బ్యాడ్మింటన్ వర్ధమాన క్రీడాకారిణి, తెలుగుతేజం పీవీ సింధు చైనా మాస్టర్స్ టోర్నీలో సంచలన విజయం సాధించి క్వార్ట ర్ ఫైనల్లో ప్రవేశించింది. కాగా, పారుపల్లి కశ్యప్ ఓటమి పాలై ఇంటిదారి పట్టాడు. గురువారం ఇక్కడ జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ లో ప్రపంచ 24వ ర్యాంక్ ప్లేయర్ సింధు 10-21, 21-7, 21-19తో వరల్డ్ 14వ ర్యాంకర్ పోర్న్‌టిప్ బురానాప్రసెర్ట్‌సక్‌పై గెలిచింది. 47 నిమిషాలు పా టు జరిగిన ఈ పోరులో తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు రెండో గేమ్‌లో విజృంభించింది.

సునాయాసంగా ఆ గేమ్‌ను సొంత చేసుకుని ఫలితాన్ని మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. నువ్వానేనా అన్నట్టు సాగిన ఉత్కంఠభరితమైన ఆఖరి గేమ్‌లో సింధు గెలిచి శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో చైనాకు చెందిన రెండో సీడ్ లీ జురూయ్‌తో అమీతుమీ సిద్ధమైంది.

పురుషుల విభాగంలో తలపడిన కశ్యప్, గురుసాయి దత్ ఆధిక్యం కోసం గంటా ఆరు నిమిషాలు పాటు పోరాడారు. చివరికి గురుసాయి 16-21, 21-18, 21-4తో ఎనిమిదో సీడ్ కశ్యప్‌పై గెలిచి క్వార్టర్స్‌లో అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగే పోటీలో సాయిదత్ టా ప్ సీడ్ చైనాకు చెందిన చెన్ లాంగ్‌తో తలపడాల్సి ఉంది.

కాగా, ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో గెలిచిన మరో ఇద్దరు భారత ఆటగాళ్లు సౌరభ్ వర్మ, అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్లో తలపడనున్నారు. సౌరభ్ వర్మ 21-12, 21-16తో చైనీస్ తైపీకి చెందిన జెన్ హో సుపై గెలవగా.. అజయ్ 21-17, 21-9తో డెరె క్ వాంగ్ (సింగపూర్)ను చిత్తు చేశాడు.

అయితే మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగి న అశ్విని పొన్నప్ప, తరుణ్ కోన జోడీ తొలి రౌండ్‌లోనే ఓటమి చవిచూసింది. ఈ భారత జోడీ 9-21, 14-21తో మలేసియా ద్వయం జియాన్ గువో ఆంగ్, యిన్ లూ లిమ్ చేతిలో ఓటమిపాలైంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+