
26వ ర్యాంక్‌లో ఉన్న జపాన్ క్రీడాకారిణి మితానీ మినాత్సును ఢీకొన్న ఆమె తొలి సెట్‌లో కొంత వరకూ పోరాడినా, ఆతర్వాత తడబడింది. ఫలితంగా మ్యాచ్‌ని 19-21, 11-21 తేడాతో చేజార్చుకుంది. నిజానికి టైటిల్ పోరులో సైనాదే విజయమని భావించారు.
ఆమె ఫామ్ కూడా అదే స్థాయిలో కొనసాగింది. లండన్ ఒలింపిక్స్ తర్వాత సుమారు రెండు నెలలు విశ్రాంతి తీసుకున్న తర్వాత డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో పాల్గొని టైటిల్ అందుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ ఆరంభంలో అదే స్థాయిలో రాణించింది.
అద్భుత విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన సైనాకు టైటిల్ దక్కుతుందని అభిమానులు ఆశించారు. కానీ, 22 ఏళ్ల ఈ హైదరాబాదీపై మినాత్సు అనూహ్యంగా చెలరేగింది. అద్భుతమైన స్మాష్‌లతో విరుచుకుపడింది. మొదటి సెట్‌లో పోరాటం సాగించినా ఫలితం లేకపోవడంతో రెండో సెట్‌లో సైనా నీరసించింది. దీనితో ఆ సెట్‌ను కూడా చేజార్చుకొని రన్నరప్ ట్రోఫీకి పరిమితమైంది.