Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ: సెమీస్‌లో సైనా, కశ్యప్ అవుట్

బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లాండు బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో టైటిల్ సాదించే దిశగా సైనా నెహ్వాల్ దూసుకుని వెళ్తోంది. కెరీర్‌లో రెండోసారి ఆమె ఈ టోర్నీలో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం నువ్వా నేనా అన్నట్లు సాగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోటీల్లో ఆమె చైనాకు చెందిన షిజియాన్ వాంగ్‌ను 23-21, 19-1, 21-16 స్కోరుతో మట్టి కరిపించింది.

పురుషుల సింగిల్స్ పోటీల్లో పారుపల్లి కశ్యప్ కథ ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో అతను చైనాకు చెందిన చెన్ లాంగ్ చేతిలో 16-21, 10-21 స్కోరుతో ఓటమి పాలయ్యాడు. సైనా, వాంగ్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. తొలి గేమ్ ఆరంభంలో సైనా కొంత ఆధిపత్యం సాధించింది. వెంటనే వాంగ్ పుంజుకుని స్కోరును సమం చేసింది. ఓ దశలో 19.16 స్కోరుతో ఆధిక్యత సాధించింది. అయితే, సైనా పుంజుకుని స్కోరును సమం చేసింది. స్కోరు 21-21 ఉన్న దశలో సైనా రెండు వరుస పాయింట్లతో గేమ్‌ను గెలుచుకుంది.

Saina Nehwal

రెండో గేమ్ ఆరంభంలో సైనా తొలుత వెనకబడింది. అయితే పుంజుకుని ఓ దశలో 17-13 స్కోరుతో మ్యాచ్ విజయానికి చేరువైంది. కానీ వాంగ్ అద్భుతమైన ప్రదర్సన చూపి గేమ్‌ను గెలుచుకుంది. నిర్ణయాత్మకమైన మూడో గేమ్‌ ఆరంభంలో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. స్కోరు 7-7తో సమమైన దశలో సైనా విజృంభించింది. 15-8 స్కోరుతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వాంగ్ ఆ తర్వాత పుంజుకుని సైనా ఆధిక్యాన్ని 12-15కు తగ్గించింది. సైనా చివరలో తెలివిగా ఆడి మ్యాచును సొంతం చేసుకుంది.

జులియన్ (జర్మనీ), రచనోక్ (థాయిలాండ్) మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచులో గెలిచే క్రీడాకారిణితో సెమీస్‌లో సైనా తలపడుతుంది. చైనా క్రీడాకారులంతా నిష్క్రమించడంతో సైనా టైటిల్ గెలిచే అవకాశాలున్నాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+