
తొలి గేమ్‌లో షిజియన్ 8-0తో దూసుకెళ్తుండగా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సైనా కొద్దిసేపు దూకుడుగా ఆడి వాంగ్ ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. అయినా ఆ గేములో 11-21తో ఓటమిపాలు కాక తప్పలేదు. అనంతరం తేరుకున్న సైనా 21-10తో రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో వాంగ్ దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోయింది. దాంతో గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ జారవిడుచుకుంది.
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అలవోక విజయం సాధించిన ఈ హైదరాబాదీ సెమీస్‌కు దూసుకెళ్లింది. సైనా క్వార్టర్స్‌లో 21-11, 21-12తో ఆరోసీడ్ జూ యింగ్ తాయ్ (తైపీ)ని వరుస గేముల్లో చిత్తు చేసి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.
ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం చలాయించిన సైనా మ్యాచ్‌ను అరగంటలోపే ముగించి యింగ్ తాయ్‌పై తన విజయాల రికార్డును 5-2కు పెంచుకుంది. యింగ్ తాయ్‌పై స్మాష్‌లతో విరుచుకుపడ్డ సైనా.. ప్రత్యర్థిని పదే పదే అనవసర తప్పిదాలు చేసేలే చేసింది. దీంతో పోరు ఏకపక్షంగా మారిపోయింది. అయితే, సెమీస్‌లో సైనా చతికిల పడింది.