Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2012 ఇండోనేసియా ఓపెన్ టైటిల్ 'సైనా నెహ్వాల్'దే

జకార్తా, జూన్ 17: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్ జురుయ్ లీ (చైనా)ను 13-21, 22-20, 21-19 తేడాతో ఓడించింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో మొదటి సెట్ గెల్చుకున్న సైనా రెండో సెట్ లో వెనుకబడింది.

Saina Nehwal
ఐతే మూడో సెట్‌లో సైనా పుంజుకుని ప్రత్యర్థి జురుయ్ లీ ఓడించి విజేతగా అవతరించింది. ఈ హైదరాబాదీ షట్లర్ 2009, 2010లోనూ ఇండోనేసియా ఓపెన్ చాంపియన్ గా నిలిచింది. ఈ ఏడాది స్విట్జర్లాండ్, థాయిలాండ్, ఇండోనేసియా టైటిల్స్ గెల్చుకోవడం ద్వారా సైనా నెహ్వాల్ సత్తా చాటింది. ఈ యేడాది కూడా సైనా నెహ్వాల్ ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్‌ను సొంతం చేసుకోవడం మూడవ సారి ఈ టైటిల్‌ను గెలుచుకున్న క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.

అంతక ముందు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సైనా శనివారం జరిగిన సెమీస్‌ పోరులో అన్‌సీడెడ్‌ కొరియా షట్లర్‌ జి హ్యూన్‌ సంగ్‌పై 22-20, 21-18తో జయ భేరి మోగించింది. ఈమెతో ముఖాముఖి రికార్డులో సైనా 1-4తో వెనుకబడి ఉంది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ కాంస్య పతకంతో సంతృప్తి పడ్డాడు. సెమీఫైనల్లో కశ్యప్ 15-21, 12-21తో ఏడో సీడ్ సిమోన్ సాంతొసో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. సూపర్ సిరీస్ టోర్నమెంట్లలో కశ్యప్‌కిది మూడో కాంస్య పతకం కావడం విశేషం. గతంలో 2010 సింగపూర్ సూపర్ సిరీస్, 2012 ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలలో కశ్యప్ కాంస్య పతకాలు గెల్చుకున్నాడు.

క్వార్టర్ ఫైనల్లో చైనా అగ్రశ్రేణి క్రీడాకారిణి షిజియాన్ వాంగ్‌ను ఓడించిన ఉత్సాహంలో ఉన్న సైనా అదే జోరును సెమీఫైనల్లోనూ కనబరిచింది. గతంలో జీ హున్ సుంగ్‌తో ఆడిన మూడు సార్లూ నెగ్గిన సైనా నాలుగోసారీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలి గేమ్‌లో 5-1తో ముందంజ వేసిన ఈ హైదరాబాదీ ఆ తర్వాత స్థిరంగా పాయింట్లు సాధిస్తూ 17-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే సెమీఫైనల్‌కు చేరుకునే క్రమంలో రెండో సీడ్ జిన్ వాంగ్ (చైనా), ఆరో సీడ్ యాన్‌జియాంగ్ జియావో (చైనా)లను ఓడించిన జీ హున్ సుంగ్ నెమ్మదిగా తేరుకొని వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 17-17 వద్ద స్కోరును సమం చేసింది.

షిజియాన్ వాంగ్‌తో శుక్రవారం తన కెరీర్‌లోనే సుదీర్ఘ మ్యాచ్ ఆడి రికార్డు నెలకొల్పిన సైనా పట్టువదలకుండా పోరాడి వరుసగా మూడు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. 50 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన సెమీస్‌లో సైనా వరస గేమ్‌ల్లో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. తొలి గేమ్‌లో 2-0తో శుభారంభం చేసిన హైదరాబాదీ అదే జోరు కొనసాగిస్తూ 16-9 ఆధిక్యం ప్రద ర్శించింది. ఆనక ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురవడంతో 19-20తో వెనకబడింది. ఈ దశలో పుంజుకున్న సైనా వరసగా పాయింట్లు గెలిచి గేమ్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో ఓ దశలో కొరియా షట్లర్ 16-13తో ముందంజ వేసినా.. సైనా మళ్లీ విజృంభించి మ్యాచ్‌ను వశం చేసుకుంది.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+