క్వార్టర్ ఫైనల్లోకి సైనా నెహ్వాల్: సాయి ప్రణీత్ ఔట్

ఇదిలావుంటే, తెలుగుతేజం సాయి ప్రణీత్ థాయిలాండ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమయ్యాడు. సంచనల విజయాలతో ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న ఆ తర్వాత ముందడుగు వేయలేకపోయాడు. ప్రీక్వార్టర్ పైనల్లో సాయి ప్రణీత్ ఇండోనేషియాకు చెందిన విస్ను యులి ప్రసెత్యో చేతిలో 18-21, 21 -16, 19-21 స్కోరుతో పోరాడి ఓడిపోయాడు.
అంతకు ముందు సైనా నెహ్వాల్, యువ క్రీడాకారిణి అరుంధతి ముందంజ వేశారు. తమ తమ ప్రత్యర్థులను ఓడించి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ చేరారు. హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల డిఫెండింగ్ చాంపియన్ సైనా 21-11, 21-16 ఆధిక్యంతో చైనీస్ తైపీ క్రీడాకారిణి షిన్ హాన్ సంగ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ కేవలం 29 నిమిషాల్లో ముగియడం విశేషం.
నాగపూర్ నుంచి భారత టాప్ క్రీడాకారిణిగా ఎదిగిన అరుంధతి 14-21, 21-9, 21-15 తేడాతో కొరియాకు చెందిన మిన్ జీ లీపై విజయం సాధించింది. అయితే, మరో భారత క్రీడాకారిణి తులసీ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మూడోసీడ్ పొర్న్‌టిప్ బరనప్రసెర్సుక్ 21-14, 21-17 స్కోరుతో తులసీపై గెలుపొందింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications