
సైనా బుధవారమిక్కడ జరిగిన ప్రీ క్వార్టర్స్ పోరులో ఐదోసీడ్ సైనా 21-14, 21-16తో 20వ ర్యాంకర్ జీ యావో (నెదర్లాండ్స్)ను వరుస గేముల్లో ఓడించి, క్వార్టర్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో సైనా సత్తాకు యావో నిలవలేకపోయింది.
సైనా నెహ్వాల్ విషయానికి వస్తే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ.. మళ్లీ లండన్ ఒలింపిక్స్ లో రెండోసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి అర్హత సాధించడం ద్వారా సైనా కూడా రికార్డు సృష్టించింది.22 సంవత్సరాల వయసు కలిగిన సైనా నెహ్వాల్ బీజింగ్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ నుండి వెనుదిరిగింది.
గత ఐదు సంవత్సరాలుగా సైనా నెహ్వాల్ ఆటతీరుని చూస్తే ఖచ్చితంగా ఈసారి లండన్ ఒలింపిక్ మెడల్‌ని సాధిస్తుందనే అభిమానుల నమ్మకాన్ని సైనా వమ్ము చేయలేదు. ఈ ఏడాది సైనా నెహ్వాల్ స్విస్ ఓపెన్, థాయ్ లాండ్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్ లాంటి పెద్ద టైటిల్స్‌ని సాధించింది.ప్రస్తుతం సైనా నెహ్వాల్ ప్రపంచ ర్యాంకింగ్‌లో ఐదవ స్దానంలో ఉంది.