Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గోపీచంద్ వేధింపులు: పుస్తకావిష్కరణలో సైనా ఖండన

 Saina Nehwal
హైదరాబాద్: తనను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారని భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ బుధవారం అన్నారు. సైనా తాను రాసిన సైనా - నెహ్వాల్ - ప్లేయింగ్ టు విన్(మై లైఫ్ ఆన్ అండ్ ఆఫ్ కోర్ట్) పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సైనా మాట్లాడారు. తాను జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. గోపీచంద్ తనను మానసికంగా వేధించాడంటూ డబుల్స్ క్రీడాకారిణి ప్రజక్త సావంత్ చేసిన ఆరోపణలపై సైనా స్పందించారు.

తాను ప్రపంచ మూడో ర్యాంకు క్రీడాకారిణిగా మీ ముందు నిల్చున్నానంటే దానికి కారణం గోపీచంద్ సర్ అని, ఆయనకు తన కృతజ్ఠతలు అన్నారు. ఇలాంటి ఆరోపణలు ఎక్కడి నుండి వస్తాయో తనకు తెలియదన్నారు. తాను రాసిన పుస్తకంతో స్ఫూర్తి పొంది చాలామంది సైనాలు వస్తారని ఆశిస్తున్నానన్నారు. తనను రాజకీయాల్లోకి కూడా ఆహ్వావిస్తున్నారన్నారు. 22 ఏళ్ల వయస్సులో ఆటో బయోగ్రఫీ విడుదల కావడం అనూహ్యమే అయినా ఆనందంగా ఉందన్నారు.

ఈ పుస్తకం ఒక విజేత ప్రయాణం గురించి చెబుతుందని, 9 ఏళ్ల నుండి 22 ఏళ్ల వయస్సు వరకు తాను ఆట కోసం ఎంత కష్టపడ్డానో, ఎన్ని త్యాగాలు చేశానో వంటి అంశాలు యువతకు స్ఫూర్తినిస్తాయనే నమ్మకం తనకుందన్నారు. బ్యాడ్మింటన్‌ను ఎంచుకొని ముందంజ వేయడంలో తల్లి సహకారం, కోచ్ శిక్షణతో పాటు ఆట నుంచి తప్పుకుంటే ఆగిపోయే ఎండార్సుమెంటులు, సెలబ్రటీ హోదాల గురించి తనకెలాంటి చింతలేదని తెలిపింది.

భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. బ్యాడ్మింటన్ కంటే తనకు విజయం సాధించడమంటేనే ఎనలేని మక్కువని తెలిపింది. ఒక క్రీడగా బ్యాడ్మింటన్‌ను పెద్దగా ఇష్టపడనని, కానీ విజయం సాధించడమంటే ఎంతో ఇష్టమని పేర్కొంది. టోర్నీలు గెలిచిన ప్రతిసారీ తనకెంతో ఇష్టమైన ఐస్ క్రీమ్‌ల్ని హాయిగా ఆరగిస్తాననని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+