
ఇప్పుడు డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ టైటిల్ ఈ ఏడాది సైనాకు నాలుగోది కావడం విశేషం. సూపర్ టైటిల్స్ విషయానికొస్తే రెండోది. మ్యాచ్ ఆసాంతం ఏకపక్షంగా సాగింది. 21-17, 21-8తో జూలియన్ పైన గెలిచింది. కేవలం 35 నిమిషాలలోనే మ్యాచ్ ముగిసింది. దీంతో జూలియన్ పైన తన విజయాల రికార్డును సైనా 6-3కు పెంచుకుంది. ఈ విజయంతో సైనాకు రూ.16 లక్షల ప్రైజ్ మనీ దక్కింది.
ఓ వైపు మోకాలి గాయం బాధిస్తున్నా సైనా గెలుపే లక్ష్యంగా ఆడి విజయం సొంతం చేసుకుంది. ఏకపక్ష పోరులో తన ట్రేడ్‌మార్క్ క్రాస్ కోర్టు షాట్లు, స్మాష్‌లు, క్లియర్ విన్నర్లతో షెంక్‌ను షేక్ చేసింది. తొలిగేమ్‌లో కొద్దిగా ప్రతిఘటించిన షెంక్ రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది.