
ఈ ఒప్పందంతో తాను థ్రిలయ్యాయని, దేవుడు తన పట్ల దయ చూపాడని, దేశంలోని మోస్ట్ పాపులర్ క్రీడాకారిణిని కావాలనేది తన స్వప్నమని సైనా అన్నది. తన కెరీర్‌లో ఇంత త్వరగా ఇంత అవకాశం లభిస్తుందని అనుకోలేదని ఆమె అన్నారు. తాను ఆటలో ప్రదర్శించిన ప్రతిభ వల్ల దేశంలో బ్యాడ్మింటన్‌కు కూడా ప్రజాదరణ లభిస్తోందని ఆమె అన్నారు.
భవిష్యత్తులో దేశం కోసం మరిన్ని టైటిల్స్ గెలుస్తానని ఆమె అన్నారు. దక్కన్ క్రానికల్ ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకుంటుందని భావించామని, అయితే అది జరగలేదని, దాంతో కొత్త ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని సైనా తండ్రి హర్వీర్ సింగ్ నెహ్వాల్ అన్నారు. దక్కన్ క్రానికల్‌తో తమ ఒప్పందం జూలై 31వ తేదీతో ముగిసిందని ఆయన చెప్పారు.
లండన్ ఒలింపిక్స్‌కు ముందు సైనా మూడు ఎండార్స్‌మెంట్లను తిరస్కరించింది. వాటిలో ఒకటి కొకకోలా కాగా, మరోటి టాప్ రియల్ ఎస్టేట్ సంస్థ. భవిష్యత్తులో వివాదాలు రాకుండా చూసుకోవడానికి యాడ్ షూట్స్ అన్నీ హైదరాబాదులోనే జరగాలని సైనా టీమ్ ఒప్పందంలో రాసుకుంది.