ఇండోనేషియా, జూన్ 14: బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరిస్‌లో ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఈరోజు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ లో ఇండోనేషియాకు చెందిన యుస్వందరిపై సైనా నెహ్వాల్ 21-17,14-21,21-13 తేడాతో గెలిచింది. గంట పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తోలి గేమ్ ను అతి కష్టం మీద గెలిచిన సైనా రెండో గేమ్ లో ఓడిపోయింది. ఎంకో కీలకమైన మూడవ గేమ్‌లో 21-13 తేడాతో అవలీలగా గెలిచింది.

అంతక ముందు జకార్తాలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ లో సైనా, జపాన్‌కు చెందిన సయాక సాటో 21-12, 14-21, 21-17పై విజయం సాధించింది. 57 నిమిషాల పాటు సాగిన మూడు సెట్ల మ్యాచ్‌లో సైనా తన ప్రత్యర్ది నుండి గెట్టి పోటిని ఎదుర్కోంది. తోలి మ్యాచ్ బారీ షాట్లతో పాయింట్లు సాధించింది. తోలి సెట్‌లో 6-6 పాయింట్లతో స్కోర్ సమమైనప్పుటికీ... ఆ తర్వాత సైనా 1-0 సాధించి తన ఆధిక్యతను కనబర్చింది.
ఐతే రెండో సెట్‌లో 12-15 ఆధిక్యతతో ఉన్న సైనాను 13-13 పాయింటల వద్ద నిలువరించిన సాయాక సాటో, ఆరు స్టయిట్ పాయింట్లు సాధించి ఆధిక్యతను 1-1తో సమం చేసింది. కీలకమైన మూడో మ్యాచ్‌లో సైనా 8-1 తేడాతో తోలి నుండే ఆధిక్యతను కనబరుస్తూ సునాయాసంగా విజయం సాధించింది. సైనా ఈ మ్యాచ్‌లో 56 పాయింట్ల పొందగా, ఆమె ప్రత్యర్ది సాటో 50 పాయింట్లు సాధించింది. ఫలితంగా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. సాటోపై గెలవడం సైనాకు ఇది ఐదోవసారి.
తెలుగు వన్ఇండియా క్రీడా విభాగం