Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహిళల సింగిల్స్ గ్రూప్ మ్యాచ్‌లో తలపడనున్న 'సైనా'

Saina Nehwal
లండన్, జులై 29: స్వర్ణ పతకమే లక్ష్యంగా లండన్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ ఈరోజు మహిళల సింగిల్స్ గ్రూప్-ఈ తొలి రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సైనా... అన్‌సీడెడ్ సబ్రీన్ జాకెట్ (స్విట్జర్లాండ్)తో తలపడుతుంది. ఈ పోటీలు వింబుల్డన్‌ వేదకగా జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ సునాయాసంగా నెగ్గే అవకాశముంది. ఇది ఇలా ఉంటే మిక్స్‌డ్ డబుల్స్‌లో గుత్తా జ్వాల, దిజు పోటీపడుతున్నారు.

ఒలింపిక్ డ్రా ప్రకారం ప్రతి గ్రూప్‌లో ముగ్గురు క్రీడాకారిణులు ఉంటారు. సైనా గ్రూప్‌లో మూడో క్రీడాకారిణి లియానే టాన్ (బెల్జియం). ఒలింపిక్స్‌కు ముందు థాయ్‌లాండ్, ఇండోనేసియా సూపర్ సిరీస్ టైటిళ్లను సొంతం చేసుకున్న ఈ హైదరాబాదీ సత్తాకు తగ్గట్టుగా ఆడితే జాకెట్‌ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. గ్రూప్‌లో జరిగే రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే సైనా ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుంది.

బీజింగ్ ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ఫైనల్లోనే వెనుదిరిగిన ఈ ప్రపంచ ఐదో ర్యాంకర్ ఈసారి ఎలాగైనా పసిడితో తిరిగి రావాలని పట్టుదలతో ఉంది. ఒలింపిక్స్‌లో పతకం గెలవడం తన కల అయినప్పటికీ దీని కోసం ఎక్కువగా ఒత్తిడికి లోనుకానని సైనా వ్యాఖ్యానించింది. మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత మేటి షట్లర్ జ్వాల పరాజయాలతో పోటీలను ప్రారంభించింది. గ్రూప్-బి డబుల్స్ తొలి లీగ్ మ్యాచ్‌లో జ్వాల-అశ్విని పొన్నప్ప జంట 16-21, 18-21తో జపాన్ ద్వయం మిజుకి ఫుజి-రెకా కకివా చేతిలో పరాజయం చవిచూశారు. మిక్స్‌డ్ డబుల్స్ గ్రూప్-సి మ్యాచ్‌లో జ్వాల-దిజు 16-21, 12-21తో ఇండోనేసియా ద్వయం అహ్మద్ తొంతోవి-లిలియానా నాత్సిర్ చేతిలో ఓడారు.

ఈరోజు భారత్ పాల్గొనే రెండు ఈవెంట్లలో మహిళల 10 మీ. ఎ యిర్ పిస్టల్, మహిళల ఆర్చరీ టీమ్ విభాగాల్లో పతకాల నిర్ధారణ అవుతుంది. ఆర్చరీలో ప్రపంచ నెంబర్‌వన్ దీపిక, చెక్రవోలు, బొంబ్యేలా ప్రాతినిధ్యం వహిస్తుండగా.. షూటింగ్‌లో హీనా సిద్ధు, అనురాజ్ సింగ్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా రు. ఇక పురుషుల లైట్ వెయిట్ (60 కిలోలు) బెస్ట్ ఆఫ్ 32 రౌండ్లో భారత బాక్సర్ జై భగవాన్ బరిలోకి దిగుతున్నాడు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+