
కాగా అంతకుముందు రోజు సైనా నెహ్వాల్ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. బుధవారం డెన్మార్క్‌లో జరిగిన డెన్మార్క్ ఓపెన్ సిరీస్‌లో మొదటి రౌండ్‌లో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ 21-17, 21-17తో కొరియాకు చెందిన ఇయాన్ జుబేను వరుస గేమ్‌ల్లో చిత్తు చేసింది.
తొలి గేమ్ ఆరంభంలో సైనా నెహ్వాల్ కాస్త తడబడింది. చివర్లో స్కోరు 17 పాయింట్ల వద్ద సమంగా ఉన్నపుడు మరోసారి స్మాష్‌లతో అదరగొట్టి వరుసగా పాయింట్లు సాధించి మొదటి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో జుబేకు ఎక్కడా ఆధిక్యమివ్వకుండా గేమ్‌తో బాటు మ్యాచ్‌నూ గెలిచి రెండో రౌండ్లో అడుగుపెట్టింది.
ఇయానా 12వ ర్యాంకర్. 39 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ స్మాష్‌ల ద్వారా 14 పాయింట్లు, నెట్ వద్ద 10 పాయింట్లు సంపాదించింది. ఈ రోజు ఫ్రీక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ జపాన్‌కు చెందిన మితాని మినత్సుతో తలపడింది. సైనా రెండు నెలల బ్రేక్ తర్వాత కోర్టులో అడుగు పెట్టింది.