కిరణ్ జెట్ ఫైటర్‌లో ప్రయాణించిన సైనా నెహ్వాల్

లండన్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో సైనా కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ పతకం సాధించినందుకు గాను సైనాకు ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఈ అరుదైన అవకాశం కల్పించింది. కాగా సైనాకు ఈ అరుదైన అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.
సైనా తమ అకాడమీకి వస్తే యువ పైలెట్లకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అప్పుడు వారు చెప్పారు. కాగా ఈ మధ్యకాలంలో ఎయిర్‌ఫోర్స ప్రతిభావంతులైనన క్రీడాకారులకు గౌరవ ర్యాంకులిచ్చి గౌరవిస్తున్న విషయం తెలిసిందే. నిరుడు సచిన్ టెండూల్కర్‌కు గౌరవ గ్రూప్ కెప్టెన్ హోదా ఇచ్చిన ఐఏఎఫ్ సచిన్, ధోనీలకు ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎస్‌యు-30ఎంకేఐలో విహరించే అవకాశాన్నిచ్చింది.
లండన్ ఒలంపిక్స్‌లో మహిళ సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో హైదరాబాదీ సైనా నెహ్వాల్ కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. దాంతో ఆమెకు ఆదరణ పెరిగింది. ఇప్పుడు చాలా మందికి ఆమె స్ఫూర్తిదాయకంగా మారారు. ఇటీవలే ఆమె ఓ కంపెనీతో 40 కోట్లరూపాయల డీల్ కూడా కుదుర్చుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications