ఐబిఎల్: రూ.71 లక్షలు పలికిన సైనా, జ్వాల 18 లక్షలు

సైనా నెహ్వాల్‌ను హైదరాబాదు జట్టు కొనుగోలు చేయడం లాభిస్తుందని చెబుతున్నారు. హైదరాబాద్ హాట్ షాట్స్ పివిపి గ్రూప్ యాజమాన్యానిది. తనను హైదరాబాద్ జట్టు లేదా లక్నో జట్టు కొనుగోలు చేయవచ్చునని సైనా నెహ్వాల్ అంతకుముందే చెప్పారు.
కాగా, భారత మేటి క్రికెటర్ సునీల్ గవాస్కర్ తెలుగు సినీ హీరో అక్కినేని నాగార్జున, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్‌తో కలిసి ఐబియల్ ముంబై ఫ్రాంచైజీని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ ఫ్రాంచైజీకి ముంబై మాస్టర్స్ అని పేరు పెట్టారు. ముంబై ఫ్రాంచైజీని సొంతం చేసుకోవడం పట్ల సన్నీ ఆనందం వ్యక్తం చేశాడు.
ఫ్రాంచైజీలో గవాస్కర్ భాగస్వామిగా ఉండడమే కాకుండా ప్రచారకర్తగా వ్యవహరిస్తాడు. ముంబై ఐబిఎల్ ఫ్రాంచైజీ కొనుగోలు డీల్ గతబుధవారం తుది రూపు తీసుకుంది. గవాస్కర్, నాగార్జున ఇద్దరు కూడా బ్యాడ్మింటన్ అభిమానులని, సన్నీ ఆట ఆడడానికి ఇష్టపడుతాడని, వచ్చే నెలలో అద్భుతమైన టోర్నమెంట్ ఉంటుందని చాముండేశ్వరీనాథ్ ఓ పత్రికతో చెప్పారు. నాగార్జున వల్ల దక్షిణ భారతదేశంలో పాపులర్ అవుతుందని ఆయన అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications