
24 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ దెబ్బకి బెల్జియం ప్లేయర్ లియాన్ తాన్ చేతులెత్తేసింది. 9 నిమిషాల పాటు జరిగిన తొలి గేమ్‌లో సైనా ఆధిక్యమే కనిపించింది. 7-0తో మొదలైన ఆధిక్యాన్ని తాన్ ఏ దశలోనూ అడ్డుకోలేకపోయింది. చివరి వరకు సైనా 18 పాయింట్ల స్పష్టమైన ఆధిక్యంతో గేమ్‌ను కైవసం చేసుకుంది. మొదటి సెట్‌ను అవలీలగా గెలుచుకున్న సైనా, రెండో సెట్‌లో ప్రత్యర్థి తాన్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదుర్కొంది.
మహిళల డబుల్స్‌లో జ్వాల - అశ్విని జోడి బోణి:
ఇది ఇలా ఉంటే మహిళల డబుల్స్ లో జ్వాలా అశ్వినిల జోడీ బి గ్రూప్ రెండో రౌండ్‌లో గెలిచింది. జపాన్ చేతిలో మొదటి మ్యాచ్ ఓడిపోయి సంక్లిష్టం చేసుకున్న ఈ జోడీ రెండో మ్యాచ్‌లో చైనీస్ తైపీ జంట వెన్ చెంగ్, చిన్ చియెన్ జంటను 25-23, 16-21, 21-18 స్కోర్‌తో ఓడించింది. మొదటి సెట్‌లో జ్వాలా అశ్వినీ గట్టి పోటీనిచ్చింది. రెండో సెట్‌లో అనవసర తప్పిదాలతో చేజార్చుకున్నా థర్డ్ సెట్‌లో పైచేయి సాధించింది. దీంతో ఈ జంట క్వార్టర్స్ ఆశలు నిలుపుకుంది. ఇదే జంట ఈరోజు సింగపూర్ షింటా మూలియా సరీ, లీ యావ్ తో ఆడుతుంది.
వింబుల్డన్ కోర్టులో డబుల్స్‌లో పేస్‌తో జతకట్టిన విష్ణు తొలి రౌండ్‌లో 7-6 (7/1), 4-6, 6-2తో రాబిన్ హాస్, జులియన్ రోజర్ (నెదర్లాండ్స్) జంటపై నెగ్గి ప్రి క్వార్టర్స్ చేరింది. తొలి సెట్ టై బ్రేకర్‌కు దారితీయగా హాస్, రోజర్ నెగ్గారు. ఆపై పేస్, విష్ణు సమన్వయంతో కదిలి విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొత్తం గంటా 52 నిమిషాల పాటు మ్యాచ్ సాగింది. మహేశ్ భూపతి-రోహన్ బోపన్న జోడి కూడా ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. తొలిరౌండ్‌లో ఏడోసీడ్ భూపతి-బోపన్న 7-6 (7/4), 6-7 (4/7), 8-6తో మాక్స్ మిర్నీ-అలెగ్జాండర్ బురే (బెలారస్)పై విజయం సాధించారు.
తెలుగు వన్ఇండియా