
నాగపూర్ నుంచి భారత టాప్ క్రీడాకారిణిగా ఎదిగిన అరుంధతి 14-21, 21-9, 21-15 తేడాతో కొరియాకు చెందిన మిన్ జీ లీపై విజయం సాధించింది. అయితే, మరో భారత క్రీడాకారిణి తులసీ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మూడోసీడ్ పొర్న్‌టిప్ బరనప్రసెర్సుక్ 21-14, 21-17 స్కోరుతో తులసీపై గెలుపొందింది.
ఇదిలావుంటే, తెలుగుతేజం సాయి ప్రణీత్ థాయిలాండ్ ఓపెన్‌లో అదరగొడుతున్నాడు. సంచనల విజయాలతో ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రౌండులో మాజీ ఆల్ ఇంగ్లాండు ఛాంపియన్ మహ్మద్ హఫీజ్ హషీమ్‌ను మట్టి కరిపించిన సాయి రెండో రౌండులో నాలుగో సీడ్ హయం రుంబకను ఓడించాడు.
కాగా, పురుషుల విభాగంలో భారత ఆటగాళ్లు అజయ్ జయరామ్, హెచ్‌ఎస్ ప్రణయ్, సౌరభ్ వర్మ, ఆనంద్ పవార్, శ్రీకాంత్ మొదటి రౌండ్ మ్యాచ్‌లను ముగించుకొని రెండో రౌండ్ చేరారు. జయరామ్ 21-11, 19-21, 21-9 ఆధిక్యంతో షెసర్ హిరెన్ రుస్టొవిటోను, ప్రణయ్ 21 11, 21-19 తేడాతో నాప్కారన్ నంతథీరోను, పవార్ 21-15, 9-21, 21-14 స్కోరుతో రియాంతో సుబాగ్యాను, సౌరభ్ 21-16, 21-18 తేడాతో కొసిత్ ఫెప్రాదబ్‌ను, శ్రీకాంత్ 21-6, 21-12 ఆధిక్యంతో హ్యుక్ జిన్ జియోన్‌ను ఓడించారు.