
ఆరంభంలోనే 18-9తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సైనా అదేఊపులో 21-10తో ఆ గేమ్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ అదే జోరు ప్రదర్శించి బాన్‌ను మట్టికరిపించింది. బాన్‌ను సైనా నెహ్వాల్ 33 నిమిషాల్లో ఓడించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్లో ఆమె చైనాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ యిహాన్ వాంగ్‌తో తలపడుతుంది.
గురువారం రెండో రౌండులో జపాన్‌కు చెందిన 28వ సీడ్ షట్లర్ మితానీ మినత్సుతో జరిగిన మ్యాచ్‌లో సైనా విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. 21-15, 21-14తో సైనా నెహ్వాల్ గెలిచింది. ఏ దశలోనూ సైనాకు మితానీ ధీటుగా నిలవలేకపోయింది. సైనా ఇరవై నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టి కరిపించింది.
కాగా అంతకుముందు రోజు సైనా నెహ్వాల్ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. బుధవారం డెన్మార్క్‌లో జరిగిన డెన్మార్క్ ఓపెన్ సిరీస్‌లో మొదటి రౌండ్‌లో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ 21-17, 21-17తో కొరియాకు చెందిన ఇయాన్ జుబేను వరుస గేమ్‌ల్లో చిత్తు చేసింది.