
ఎనిమిదో సీడ్ జువాన్‌తో తలపడ్డ ఆరుసార్లలో సైనాకు ఇదే తొలి ఓటమి. తొలి గేమ్‌లో సైనాకు అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. అయితే ప్రపంచ నెం.23 జువాన్ కీలక రెండో గేమ్‌లో పుంజుకుంది. ప్రపంచ నెం.2 సైనా ఈ గేమ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోయింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మూడో గేమ్‌లో ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు పోరాడారు.
థాయ్‌లాండ్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నీలో శుక్రవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత యువ షట్లర్ కె.శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీస్ చే రి సంచలనం సృష్టించాడు. 20 ఏళ్ల శ్రీకాంత్ ఇక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్స్ పోరులో వాగ్ హు సన్ (దక్షిణకొరియా)పై 21-17, 21-18తో వరుస రెండు గే ముల్లో ఘన విజయం సాధించాడు.
శ్రీకాంత్ సెమీస్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన థామ్‌సిన్ సితికుమ్‌తో తలపడనున్నాడు. మరో పురుషుల క్వార్టర్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 12-21, 19-21తో విష్ణు యులి ప్రసెత్యో (ఇండోనేషియా) చేతిలో ఓడాడు.