
కాగా థాయ్‌లాండ్ ఓపెన్ మహిళా టెన్నిస్ సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ శనివారం ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మూడో సీడ్ పోర్న్‌టిప్ బురనప్రసెర్‌టస్క్‌పై 24-12, 21-11తో సైనా సునాయాస విజయం సాధించింది. సైనా దాటికి రెండు సెట్లలో పోరు ఏకపక్షమే అయింది.
ఫైనల్‌లో సైనా చైనా క్రీడాకారిణి లిన్ వాంగ్‌తో తలపడనుంది. అంతకుముందు ఉదయం జరిగిన మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో థాయ్ క్రీడాకారిణి రాచ్‌నాక్ ఇంతనన్‌పై లిన్ వాంగ్ 21-13, 21-19 తేడాతో గెలుపొందింది. కాగా, లండన్ ఒలింపిక్స్‌కు ముందు థాయ్‌లాండ్ ఓపెన్ ఫైనల్ చేరడం సైనా నెహ్వాల్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచనుంది.
నెమ్మదిగా ప్రారంభించిన సైనా తర్వాత పుంజుకుని అద్భుతందా ఆడిందని కోచ్ పుల్లెల గోపిచంద్ అన్నారు. పోర్న్‌టిప్ స్మాష్‌లతో అదరగొడుతున్న సమయంలో సైనా చాలా మందకొడిగా ప్రారంభమైందని, దాంతో తొలుత సైనా వెనకబడిపోయిందని, గేమ్ రెండో పార్టులో సైనా పుంజుకుందని, దాంతో నువ్వా నేనా అనే స్థాయికి చేరిందని, చాలా టైట్ ఫినిష్‌గా సైనా ముగించిందని ఆయన వివరించారు.
రెండో గేమ్‌లో ఆత్మ విశ్వాసం పెరిగి ప్రత్యర్థిని సైనా దీటుగా ఎదుర్కుందని ఆయన చెప్పారు. కోర్టులో కుదురుకోవడానికి సైనా సమయం తీసుకుందని ఆయన అన్నారు. సైనా ప్రదర్శించిన పోరాట పటిమ ఆనందం కలిగిస్తోందని ఆయన అన్నారు.