
తొలి గేమ్ ఆరంభంలో సైనా నెహ్వాల్ కాస్త తడబడింది. చివర్లో స్కోరు 17 పాయింట్ల వద్ద సమంగా ఉన్నపుడు మరోసారి స్మాష్‌లతో అదరగొట్టి వరుసగా పాయింట్లు సాధించి మొదటి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో జుబేకు ఎక్కడా ఆధిక్యమివ్వకుండా గేమ్‌తో బాటు మ్యాచ్‌నూ గెలిచి రెండో రౌండ్లో అడుగుపెట్టింది.
ఇయానా 12వ ర్యాంకర్. 39 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ స్మాష్‌ల ద్వారా 14 పాయింట్లు, నెట్ వద్ద 10 పాయింట్లు సంపాదించింది. ఈ రోజు ఫ్రీక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ జపాన్‌కు చెందిన మితాని మినత్సుతో తలపడనుంది. సైనా రెండు నెలల బ్రేక్ తర్వాత కోర్టులో అడుగు పెట్టింది.
కాగా, పురుషుల సింగిల్స్‌లో ఆనంద్ పవార్ పోరాడినా ఫలితం లేకపోయింది. జపాన్‌కు చెందిన ఐదో సీడ్ సొ ససాకీ 14-21, 21-15, 21-11తో పవార్‌పై నెగ్గాడు. పురుషుల డబుల్స్‌లో తరుణ్‌కోన-అరుణ్ విష్ణు జోడీ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది.