
ఈ సందర్భంగా ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం, జేఈవో శ్రీనివాసరాజు ఆమెను మర్యాద పూర్వకంగా కలిసి మాట్లాడారు. దర్శనానంతరం టీటీడీ అధికారులు ఆమెకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు. వేంకటేశ్వరస్వామి దయతోనే తాను ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించానని చెప్పింది. అనంతరం కొద్దిసేపు సరదాగా షటిల్ ఆడింది. ఈ సందర్భంగా జేఈవో చేతుల మీదుగా స్థానిక క్రీడాకారులు సైనాకు శ్రీవారి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం తిరుపతిలోని మహతి మందిరంలో టీటీడీ ఆధ్వర్యంలో సైనా నెహ్వాల్‌కు పౌర సన్మానం జరిగింది.
ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తర్వాత తొలిసారిగా ఆమె తిరుమలకు వచ్చింది. దేశం కోసం మరిన్ని పథకాలను సాధిస్తానని తెలిపారు.