
ఈ విషయంలో కోచ్ గోపీచంద్, సైనా నెహ్వాల్ నాకెంతో ప్రేరణగా నిలుస్తున్నారు. చైనీయులపై సైనా సాధిస్తున్న విజయాలతో నా దృక్పథం కూడా మారింది. లండన్ ఒలింపిక్స్ ద్వారా ఎంతో అపారమైన అనుభవం వచ్చింది. సెప్టెంబర్‌లో జరిగే టోర్నమెంట్‌లో ఆడేందుకు చైనా, జపాన్ వెళ్తున్నానని చెప్పాడు.
నిన్న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇద్దరికి 'రాజీవ్ ఖేల్‌రత్న'... 25 మందికి 'అర్జున'... ఎనిమిది మందికి 'ద్రోణాచార్య'... నలుగురికి 'ధ్యాన్‌చంద్' పురస్కారాలు లభించాయి. అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డీలకు రూ. 5 లక్షల చొప్పున నగదు లభించగా... రాజీవ్ ఖేల్ రత్న అవార్డు క్రింద పతకం, ప్రశంసాపత్రంతోపాటు రూ. 7.5 లక్షల నగదు పురస్కారం లభించింది. కొన్నేళ్లుగా భారత బాక్సింగ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న క్యూబాకు చెందిన ఫెర్నాండెజ్‌కు 'ద్రోణాచార్య' అవార్డును ఇవ్వడంతో
తొలిసారి విదేశీ కోచ్‌కు జాతీయ పురస్కారం లభించినట్లైంది.
రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న (2): విజయ్ (షూటింగ్), యోగేశ్వర్ దత్ (రెజ్లింగ్)
అర్జున అవార్డు (25): దీపిక కుమారి, బొంబేలా దేవి (ఆర్చరీ), సుధా సింగ్, కవితా రౌత్ (అథ్లెటిక్స్), పారుపల్లి కశ్యప్, అశ్విని పొనప్ప (బ్యాడ్మింటన్), ఆదిత్య మెహతా (బిలియర్డ్స్ అండ్ స్నూకర్), వికాస్ కృషన్ (బాక్సింగ్), యువరాజ్ సింగ్ (క్రికెట్), సర్దార్ సింగ్ (హాకీ), యష్‌పాల్ సోలంకి (జూడో), అనూప్ కుమార్ (కబడ్డీ), సమీర్ సుహాగ్ (పోలో), అన్నురాజ్ సింగ్, ఓంకార్ సింగ్, జాయ్‌దీప్ కర్మాకర్ (షూటింగ్), దీపిక పల్లికల్ (స్క్వాష్), సందీప్ సెజ్వాల్ (స్విమ్మింగ్), సోనియా చాను (వెయిట్‌లిఫ్టింగ్), నర్సింగ్ యాదవ్, రాజిందర్ కుమార్, గీత పోగట్ (రెజ్లింగ్), బిమల్జీత్ సింగ్ (వుషు), దీపా మల్లిక్, రామ్‌కరణ్ సింగ్ (అథ్లెటిక్-పారాలింపిక్స్).
ద్రోణాచార్య అవార్డు (8): వీరేందర్ పూనియా (అథ్లెటిక్స్), సునీల్ దబాస్ (కబడ్డీ), యష్‌వీర్ సింగ్ (రెజ్లింగ్), హరేంద్ర సింగ్ (హాకీ), సత్యపాల్ సింగ్ (పారా స్పోర్ట్స్ అథ్లెటిక్స్), జె.ఎస్.భాటియా (అథ్లెటిక్స్, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్), భవానీ ముఖర్జీ (టేబుల్ టెన్నిస్, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్), బి.ఐ.ఫెర్నాండెజ్ (బాక్సింగ్).
ధ్యాన్‌చంద్ అవార్డు (4): జగ్‌రాజ్ సింగ్ మాన్ (అథ్లెటిక్స్), గుణ్‌దీప్ కుమార్ (హాకీ), వినోద్ కుమార్ (రెజ్లింగ్), సుఖ్‌బీర్ సింగ్ తొకాస్ (పారా స్పోర్ట్స్).
తెలుగు వన్ఇండియా