Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సైనాతో అటువంటిదేమీ లేదు, ఫ్రెండ్ మాత్రమే: కశ్యప్

Parupalli Kashyap
న్యూఢిల్లీ: స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ అన్నా డు. సైనా తనకు సుదీర్ఘకాలంగా తెలుసని, టోర్నీల సందర్భంగా తాము పరస్పరం సాయం చేసుకుంటామని చెప్పాడు. స్నే హానికి మించి తమ మధ్య ఏదో ఉందన్న పుకార్లు వాస్తవం కాదని కశ్యప్ స్పష్టం చేశాడు.

సైనా నెహ్వాల్‌తో తాను డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అతను ఒ పత్రికతో అన్నాడు. తామిద్దరం మంచి మిత్రులమని, అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని కశ్యప్ చెప్పాడు. నిజాయితీగా చెబుతున్నానని, తమ గురించి వస్తున్నవన్నీ జోకులూ వదంతులేనని అతను అన్నాడు. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని అతను అన్నాడు.

ఒలింపిక్స్‌లో ప్రదర్శన, అర్జున అవార్డును అందుకోవడం తనకు ఎంతో గుర్తింపును తెచ్చి పెట్టాయని కశ్యప్ అన్నాడు. ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్నవారినే సన్మానించడం, మిగతా వారిని నిర్లక్ష్యం చేయడం తనకు బాధ కలిగించిందని కశ్యప్ చెప్పాడు.

సైనా నుంచి తాను స్ఫూర్తి పొందానని చెప్పాడు. హైదరాబాదీలు అయిన సైనా, కశ్యప్ నగరంలోని గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. లండన్ ఒలింపిక్స్‌లో సైనా కాంస్యం సాధించగా, కశ్యప్ క్వార్టర్స్ దాకా ఆడాడు. ఇటీవల అర్జున అవార్డు పొందిన 25 ఏళ్ల కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఇప్పట్లో పెళ్లి చేసుకునే యోచన లేదు. ప్రస్తుతం ఆటపైనే దృష్టిసారిస్తున్నా. ప్రేమ, పెళ్లి వార్తలన్నీ అబద్ధమే' అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+