
ఒలింపిక్ చాంపియన్ తౌఫిక్ హిదాయత్‌ను మట్టికరిపించి సంచలనం సృష్టించిన తెలుగుతేజం సాయి ప్రణీత్ రెండో రౌండ్‌లో వెనుదిరిగాడు. వరల్డ్ నెంబర్ వన్ చోంగ్ వీ లీ (మలేసియా) చేతిలో 18-21, 12-21తో ఓటమి చవిచూశాడు.
సౌరభ్ వర్మ, డబుల్స్‌లో అశ్వినీ జోడీల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నెంబర్ టూ సైనా 21-13, 21-19తో జపాన్ షట్లర్ సయాక టకహషిపై అలవోకగా నెగ్గింది.
పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు గురుసాయిదత్ 21-12, 9-21, 21-19తో కజుమస సకాయ్ (జపాన్)పై దాదాపు గంట సేపు పోరాడి గెలిచాడు. మరో మ్యాచ్‌లో అజయ్ జయరామ్ 22-20, 21-12తో స్థానిక షట్లర్ సోనీ డ్విపై నెగ్గాడు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో తరుణ్ కోనతో జతకట్టిన అశ్విని 14-21, 21-17, 13-21తో పోలాండ్ జోడీ రాబర్ట్, నడియెజ్డా చేతిలో మహిళల విభాగంలో ప్రద్న్య గాద్రెతో కలసి 13-21, 19-21తో స్థానిక ద్వయం అన్నెకె, డెల్లా చేతిలో ఓటమి చవిచూసింది.