Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లో సైనా, ఓడిన కశ్యప్

Saina Nehwal
జకార్తా: భారత స్టార్‌ మహిళా సింగిల్స్‌ బ్యాడ్మింటన్ స్టార్ ఇండోనేషియా ఓపెన్‌లో నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. సైనా ఈ టోర్నీలో మూడో టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. నెహ్వాల్‌ 2009, 2010 ఇండోనేషియన్‌ టైటిల్స్‌ సాధించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సైనా శనివారం జరిగిన సెమీస్‌ పోరులో అన్‌సీడెడ్‌ కొరియా షట్లర్‌ జి హ్యూన్‌ సంగ్‌పై 22-20, 21-18తో జయ భేరి మోగించింది.

దీంతో సైనా నెహ్వాల్‌కు వరుసగా నాలుగో ఏడాది ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ జురుయ్ లీ (చైనా)తో సైనా అమీతుమీ తేల్చుకుంటుంది.

ఉదయం 10.30 గంటల నుండి నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఐదు విభాగాల్లో ఫైనల్స్ జరుగుతాయి. సైనా నెహ్వాల్‌ ఆడనున్న మ్యాచ్ మూడో మ్యాచ్

ఈమెతో ముఖాముఖి రికార్డులో సైనా 1-4తో వెనుకబడి ఉంది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ కాంస్య పతకంతో సంతృప్తి పడ్డాడు. సెమీఫైనల్లో కశ్యప్ 15-21, 12-21తో ఏడో సీడ్ సిమోన్ సాంతొసో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. సూపర్ సిరీస్ టోర్నమెంట్లలో కశ్యప్‌కిది మూడో కాంస్య పతకం కావడం విశేషం. గతంలో 2010 సింగపూర్ సూపర్ సిరీస్, 2012 ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలలో కశ్యప్ కాంస్య పతకాలు గెల్చుకున్నాడు.

క్వార్టర్ ఫైనల్లో చైనా అగ్రశ్రేణి క్రీడాకారిణి షిజియాన్ వాంగ్‌ను ఓడించిన ఉత్సాహంలో ఉన్న సైనా అదే జోరును సెమీఫైనల్లోనూ కనబరిచింది. గతంలో జీ హున్ సుంగ్‌తో ఆడిన మూడు సార్లూ నెగ్గిన సైనా నాలుగోసారీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలి గేమ్‌లో 5-1తో ముందంజ వేసిన ఈ హైదరాబాదీ ఆ తర్వాత స్థిరంగా పాయింట్లు సాధిస్తూ 17-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే సెమీఫైనల్‌కు చేరుకునే క్రమంలో రెండో సీడ్ జిన్ వాంగ్ (చైనా), ఆరో సీడ్ యాన్‌జియాంగ్ జియావో (చైనా)లను ఓడించిన జీ హున్ సుంగ్ నెమ్మదిగా తేరుకొని వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 17-17 వద్ద స్కోరును సమం చేసింది.

షిజియాన్ వాంగ్‌తో శుక్రవారం తన కెరీర్‌లోనే సుదీర్ఘ మ్యాచ్ ఆడి రికార్డు నెలకొల్పిన సైనా పట్టువదలకుండా పోరాడి వరుసగా మూడు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. 50 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన సెమీస్‌లో సైనా వరస గేమ్‌ల్లో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. తొలి గేమ్‌లో 2-0తో శుభారంభం చేసిన హైదరాబాదీ అదే జోరు కొనసాగిస్తూ 16-9 ఆధిక్యం ప్రద ర్శించింది. ఆనక ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురవడంతో 19-20తో వెనకబడింది. ఈ దశలో పుంజుకున్న సైనా వరసగా పాయింట్లు గెలిచి గేమ్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో ఓ దశలో కొరియా షట్లర్ 16-13తో ముందంజ వేసినా.. సైనా మళ్లీ విజృంభించి మ్యాచ్‌ను వశం చేసుకుంది.

తెలుగు వన్ఇండియా క్రీడా విభాగం

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+