Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా పోటీల్లో చేతులెత్తేసిన సైనా నెహ్వాల్

 Saina Nehwal
న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం రెండో రౌండ్‌లోనే ముగిసింది. ప్రపంచ ఐదో నెంబర్ సైనా నెహ్వాల్‌ ఓటమి చవిచూసి భారతీయుల ఆశలపై నీళ్లు చల్లింది. మహిళల సింగిల్స్ రెండోరౌండ్లో ఐదోసీడ్ సైనాకు 40వ సీడ్ జియావో జియా చెన్ (చైనా) షా కిచ్చింది.

గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాదీ సైనా 13-21, 16-21తో చెన్ చేతిలో చిత్తయింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఐదోసీడ్ సైనా స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయిం ది. 44 నిమిషాల పాటు సాగిన పోరులో చెన్ ఆరంభం నుంచి సైనాపై పూర్తి ఆధిపత్యం కొనసాగించింది.

మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత ఏస్ జోడీ గుత్తా జ్వాల, దిజు కూడా ఓటమిపాలైంది. ఇక తొలిరౌండ్లో 11వ సీడ్ ఆటగాణ్ని ఓడించి సం చలనం సృష్టించిన సాయి ప్రణీత్ జోరుకు రెండో రౌండ్లోనే బ్రేక్ పడింది. ఇక సాయి ప్రణీత్ రెండో రౌండ్లో 9-21, 18-21తో ఎనిమిదో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో జ్వాల, దిజు జోడీ 14-21, 21-11, 17-21తో కొరియా ద్వయం సా రాంగ్ కిమ్, హె ఇన్ చొయ్ చేతిలో పోరాడి ఓడింది.

మరో మిక్స్‌డ్ డబుల్స్ జోజీ అక్షయ్, ప్రాద్య్నా గాద్రే కూడా రెండో రౌండ్‌లోనే చేతులెత్తేశారు. హాంగ్‌కాంగ్‌కు చెందిన వాయ్ హాంగ్ వోంగ్, హోయి వా చౌ చేతిలో 19-21, 7-21 స్కోరుతో ఓటమి పాలయ్యారు. మహిళా డబుల్స్‌లో కూడా ప్రద్న్నా గాద్రే, ప్రజక్తా సావంత్ కూడా రెండో రౌండ్‌లోనే ఓటమి పాలయ్యారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+