
తాను విజయానికి చేరువైనా అకస్మాత్తుగా మోకాలు బాధించడంతో తప్పుకోక తప్పలేదని, తన ఫిజియో సలహాపైనే ఈ నిర్ణయం తీసుకున్నానని సైనా నెహ్వాల్ చెప్పింది. సూపర్ సిరీస్ ఫైనల్స్ నుంచీ తానీ గాయంతో బాధ పడుతున్నానని, ఇప్పుడు అది మరింత ఉధృతమయ్యే అవకాశం ఉన్నందున ఈ టోర్నీలో ఇకపై కొనసాగలేనని చెప్పింది.
సైనా కావాలనే తప్పుకొందని, అంత ఇష్టం లేకపోతే ఎందుకు పాల్గొనాలని భారత బ్యాడ్మింటన్ సంఘం అధికారి ఒకరు విమర్శించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజే హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణం టికెట్ బుక్ చేసుకుందని, బుధవారం సాయంత్రం 3.30 ఫ్లయిట్‌కు టికెట్ బుక్ అయ్యిందని ఆయన తెలిపారు. తొలుత షెడ్యూల్ ప్రకారం సైనా మ్యాచ్ మధ్యా హ్నం 2.30 ప్రారంభం కావాల్సి ఉండగా, ఆమె అభ్యర్ధనపై 12.30కే నిర్వహించామని, ఇలా చే స్తుందని ఎలా ఊహించగలమని ఆయన అన్నా రు.
స్థానిక కం పెనీ సహారా పరివార్ గ్రూప్ ఒత్తిడి మేరకే ఈ టోర్నీలో పాల్గొనేందుకు అన్యమనస్కంగానే సైనా ఒప్పుకుందని ఆయన చెప్పారు. సహారా గ్రూప్ అంబాసిడర్‌గా సైనా నియమితురాలైన విషయం తెలిసిందే. నిరుడు బిజీ షెడ్యూల్ కారంణంగా సైనా ఈ టోర్నీకి దూరంగా ఉంది. 2009, 2010 సంవత్సరాల్లో సైనా ఈ టోర్నీ విజేతగా నిలిచింది.
విజయానికి చేరువైనా మ్యాచ్ నుంచి నిష్క్రమించాలని సైనా తీసుకున్న నిర్ణయాన్ని కోచ్ గోపీచంద్ సమర్థించాడు. చాలా కాలం నుంచి వరుసగా మ్యాచ్‌లు ఆ డుతున్నందువల్ల సైనా అలసి పోయిందని గోపీ చెప్పాడు. సైనా మోకాలు బాధించకుండా ఉంటే ఆమె కొనసాగడాన్నే తాను ఇష్టపడతానని గోపీ అన్నాడు.