గ్వాంగ్‌ఝు: ప్రపంచ బ్యాట్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ షట్లర్ పివి సింధు పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళా సింగిల్స్ సెమీ ఫైనల్‌లో 10-21, 13-21 స్కోర్‌తో మూడో సీడ్ థాయ్‌లాంగ్ క్రీడాకారిణి ఇంతనాన్ రచనోక్ చేతిలో పరాజయం పాలైంది.
ఆరంభం నుంచి దూకుడా ఆడిన థాయ్‌లాంగ్ షట్లర్ సింధును కట్టడి చేసింది. 35 నిమిషాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు ఏమాత్రం ఆకట్టు లేకపోయింది. సెమీస్‌లో ఓడిన సింధు కాంస్యం పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ ఘనత సాంధించిన తొలి భారత మహిళా షట్లర్‌గా సింధు రికార్డు సృష్టించారు.

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నీలో తొలిసారిగా బరిలోకి దిగిన సింధు చైనా షట్లర్లకు షాక్‌లమీద షాక్‌లిస్తూ సెమీఫైనల్ చేరింది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. శుక్రవారమిక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో పదో సీడ్ సింధు 21-18, 21-17తో చైనాకు చెందిన ఏడో సీడ్ షిజియన్ వాంగ్‌ను వరుస సెట్లలో చిత్తుచేసింది.
కాగా, ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం కోసం సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ మరోసారి క్వార్టర్స్‌లో గట్టెక్కలేకపోయింది. గత రెండు సీజన్లలోనూ క్వార్టర్స్‌కే పరిమితమైన మూడో సీడ్ సైనా 21-23, 9-21తో 13వ సీడ్ యెన్ జు బె (కొరియా) చేతిలో ఓటమిపాలై నిరాశపర్చింది.