జపాన్ సూపర్ సిరీస్‌లో సింధు ఓటమి, భారత్ ఇంటికే

కొరియాకు చెందిన నాలుగో సీడ్ యాన్ జు బేతో తలపడిన సింధు 21-10, 12-21, 18-21తో 52 నిమిషాల హోరాహోరీ పోరాటంలో పరాజయం పాలైంది. నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో సింధు స్మాష్‌లతో విరుచుకుపడ్డా బే నెట్ గేమ్‌తో సింధును చిత్తు చేసింది. తొలి గే మ్ ప్రారంభంలోనే 8-0తో ఆధిక్యంలోకి దూ సుకెళ్లిన సింధు వరుసగా పాయింట్లు సాధించి ప్రత్యర్థిని వణికించింది. పెద్దగా ప్రతిఘటన లేకుండానే గేమ్‌ను భారత షట్లర్ దక్కించుకుంది.
రెండో గేమ్ ప్రారంభంలో కూడా 3-0తో ఆధిక్యం సాధించి మరో సంచలన విజయం దిశగా సాగుతున్న తరుణంలో బే పుంజుకుని సింధు దూకుడుకు చెక్ చెప్పింది. ఒక దశలో 10-10తో స్కోరు సమానంగా ఉన్నా అనత రం సింధు పాయింట్లు సాధించలేకపోయింది. కీలక మూడో గేమ్‌లో బే ఏమాత్రం అవకాశమివ్వలేదు.
స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ దూసుకుపోయింది. ఆఖరి సమయంలో ప్రతిఘటించినా.. సింధుకు నిరాశే మిగిలింది. జయ్‌రామ్ కూడా అవుట్ పురుషుల సింగిల్స్‌లో ఏమాత్రం పోటీనివ్వకుండానే జయరామ్ ప్రత్యర్థికి మ్యాచ్‌ను అప్పజెప్పాడు. మలేసియాకు చెందిన వీ ఫెంగ్ చాం గ్ 21-16, 21-16తో 35 నిమిషాల్లోనే వరుస గేమ్‌ల్లో జయరామ్‌ను చిత్తుచేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications