ప్రపంచ కప్: చరిత్ర సృష్టించిన తెలుగుతేజం సింధు

కాగా, ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం కోసం సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ మరోసారి క్వార్టర్స్‌లో గట్టెక్కలేకపోయింది. గత రెండు సీజన్లలోనూ క్వార్టర్స్‌కే పరిమితమైన మూడో సీడ్ సైనా 21-23, 9-21తో 13వ సీడ్ యెన్ జు బె (కొరియా) చేతిలో ఓటమిపాలై నిరాశపర్చింది.
పురుషుల సింగిల్స్‌లో పతకంపై ఆశలు రేకెత్తించిన పారుపల్లి కశ్యప్ పోరాటం కూడా క్వార్టర్స్‌లోనే ముగిసింది. మూడో సీడ్ పెంగ్యూ డుతో ఉత్కంఠగా జరిగిన పోరులో ప్రపంచ 17వ ర్యాంకర్ కశ్యప్ 21-16, 22-20, 21-15తో మూడు గేమ్‌లపాటు పోరాడి ఓడాడు. దీంతో ఈ టోర్నీలో సింధు మినహా భారత షట్లర్ల పోరాటం ముగిసినట్టయింది.
శనివారం జరిగే సెమీస్‌లో సింధు థాయ్‌లాండ్‌కు చెందిన నాలుగో సీడ్ ఇంతనోన్ రట్చనోక్‌తో తలపడుతుంది. మ్యాచ్‌లో నెగ్గితే సింధుకు స్వర్ణం లేదా రజతం ఖరారయినట్టే. ఒకవేళ సెమీస్‌లో ఓడినా కాంస్యం దక్కుతుంది. గతంలో రట్చనోక్‌తో ఒకసారి మాత్రమే తలపడ్డ సింధు ఓటమిపాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications