
క్వార్టర్ ఫైనల్లో ఒలింపిక్స్ ఛాంపియన్ లీ జురూయ్‌ని చిత్తు చేసి మహిళా సింగిల్స్ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచ నెంబర్ 24 సింధు ఒక్కర్తె ఈ టోర్నీలో భారతదేశం నుంచి పాల్గొంది. ప్రపంచ రెండో సీడ్ జురూయ్‌ని సింధు 21-19, 9-21, 21 -16 స్కోరుతో ఓడించింది. ఈ ఆట 45 నిమిషాల పాటు సాగింది. సింధు ప్ర్తత్యర్థికన్నా ఎక్కువ దూకుడు ప్రదర్శించింది. సింధు 26 స్మాష్ విన్నర్స్ షాట్లు కొట్టింది.
సింధు టోర్నీలోకి ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టింది. 17 ఏళ్ల తెలుగు అమ్మాయి సింధుగురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ లో ప్రపంచ 24వ ర్యాంక్ ప్లేయర్ సింధు 10-21, 21-7, 21-19తో వరల్డ్ 14వ ర్యాంకర్ పోర్న్‌టిప్ బురానాప్రసెర్ట్‌సక్‌పై గెలిచింది.
దీంతో ఆమె క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 47 నిమిషాలు పా టు జరిగిన ఈ పోరులో తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు రెండో గేమ్‌లో విజృంభించింది. సునాయాసంగా ఆ గేమ్‌ను సొంత చేసుకుని ఫలితాన్ని మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. సైనా నెహ్వాల్ ఈ టోర్నమెంటులో పాల్గొనలేదు.