
ఈ సందర్బంలో సైనా నెహ్వాల్ మాట్లాడుతూ ఒలింపిక్స్ కోసం మరింత కృషి చేస్తానని సైనా ఈ సందర్భంగా స్పష్టం చేసింది. తనని ప్రోత్సహించిన రాష్ట్ర ప్రభుత్వం, కోచ్ పుల్లెల గోపీచంద్, తండ్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. చైనా షట్లర్ లీపై విజయం సాధించడం ఆనందంగా ఉందని పేర్కొంది. బ్యాడ్మింటన్‌లో చైనా క్రీడాకారిణీలు బాగా ఆడుతున్నారని తెలిపింది.
ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్ జురుయ్ లీ (చైనా)ను 13-21, 22-20, 21-19 తేడాతో ఓడించిన, భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి, మహిళల సింగిల్స్ టైటిల్ ను సొంతం చేసుకుంది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో మొదటి సెట్ గెల్చుకున్న సైనా రెండో సెట్ లో వెనుకబడింది.
ఐతే మూడో సెట్‌లో సైనా పుంజుకుని ప్రత్యర్థి జురుయ్ లీ ఓడించి విజేతగా అవతరించింది. ఈ హైదరాబాదీ షట్లర్ 2009, 2010లోనూ ఇండోనేసియా ఓపెన్ చాంపియన్ గా నిలిచింది. ఈ ఏడాది స్విట్జర్లాండ్, థాయిలాండ్, ఇండోనేసియా టైటిల్స్ గెల్చుకోవడం ద్వారా సైనా నెహ్వాల్ సత్తా చాటింది. ఈ యేడాది కూడా సైనా నెహ్వాల్ ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్‌ను సొంతం చేసుకోవడం మూడవ సారి ఈ టైటిల్‌ను గెలుచుకున్న క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
తెలుగు వన్ఇండియా