Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాడ్మింటన్: ఒలింపిక్స్‌కు సైనా ప్రయాణం సాగిందిలా..!

లండన్, ఆగస్టు 5: భారీ అంచనాలతో లండన్ ఒలింపిక్స్‌కు వెళ్లిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్‌లో కాంస్యం గెలిచింది. నాలుగేళ్ల క్రితం బీజింగ్‌లో క్వార్టర్స్‌లో ఓడి కన్నీరు పెట్టిన ఈ హైదరాబాదీ... ఈసారి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఒలింపిక్స్‌లో ముచ్చటగా మూడో పతకం భారత్ ఖాతాలో చేరింది.

Saina Nehwal

పదిహేనేళ్ల శ్రమ ఫలించింది. సైనా నెహ్వాల్ తన ఒలింపిక్ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఇప్పటికే ఎన్నో 'తొలి' విశిష్టతలను తన ఖాతాలో వేసుకున్న ఈ హైదరాబాదీ ప్రస్థానం లాల్‌బహదూర్ స్టేడియంలో మొదలైంది. ఆమె తల్లిదండ్రులు హర్‌వీర్ సింగ్, ఉషా హర్యానాలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌లు. సైనా గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఉష బ్యాడ్మింటన్ ఆడేవారు. అయితే ఐదు నెలలు వచ్చాక డాక్టర్ల సలహాతో ఆమె ఆటను మానేశారు.

సైనాకు ఐదేళ్ల వయస్సు వచ్చినపుడు తండ్రి ఉద్యోగరీత్యా వారి కుటుంబం హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడింది. ఏడేళ్ల ప్రాయంలో సైనాను తొలుత లాల్‌బహదూర్ స్టేడియంలో కరాటే శిక్షణ తరగతుల్లో చేర్పించారు. ఆమె 'బ్రౌన్ బెల్ట్' కూడా సంపాదించింది. అక్కడే సైనాను రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్) బ్యాడ్మింటన్ కోచ్ పీఎస్‌ఎస్ నానీ ప్రసాద్ రావు గుర్తించారు. సైనా శరీరాకృతి బ్యాడ్మింటన్ ఆటకు సరిపోతుందని తండ్రి హర్‌వీర్ సింగ్‌కు ఆయన సూచించారు. దాంతో కరాటే తరగతులకు స్వస్తి చెప్పి 'రాకెట్'ను చేతబట్టింది.

లాల్‌బహదూర్ స్టేడియంలోనే 'ద్రోణాచార్య' అవార్డు గ్రహీత ఎస్.ఎం.ఆరిఫ్ వద్ద మరిన్ని మెళకువలు నేర్చుకుంది. అటు తర్వాత పలు రాష్ట్రస్థాయి టోర్నీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. 12 ఏళ్ల వయస్సులో యోనెక్స్ నుంచి స్పాన్సర్‌షిప్ లభించడంతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. 2003లో చెక్ రిపబ్లిక్ జూనియర్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గి సైనా తొలి అంతర్జాతీయ టైటిల్‌ను సాధించింది. 2006లో ఫిలిప్పీన్స్ ఓపెన్ 'ఫోర్‌స్టార్' టోర్నీలో సైనా విజేతగా నిలిచి వార్తల్లోకి వచ్చింది.

సైనా నెహ్వాల్ వ్యక్తిగత రికార్డులు:

* భారత్‌కు ఒలింపిక్ పతకం సాధించిన రెండో మహిళ సైనా. తొలి పతకం కూడా రాష్ట్రానికే చెందిన కరణం మల్లీశ్వరి (వెయిట్‌లిఫ్టింగ్) 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో గెలిచింది.
* ఈ ఒలింపిక్స్‌లో హైదరాబాద్ క్రీడాకారులు ఇద్దరు కాంస్యాలు గెలిచారు.
* బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్‌కు తొలి ఒలింపిక్ సాధించిన ఘనత సైనాది.
* ఓవరాల్‌గా ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది పదో వ్యక్తిగత మెడల్.
* ఒలింపిక్స్‌లో భారత్ మూడు పతకాలు సాధించడం ఇది రెండోసారి.

సైనా వ్యక్తిగతం

పుట్టిన తేదీ, వయస్సు: 17 మార్చి, 1990 (22 ఏళ్లు)
జన్మస్థలం: హిస్సార్ జిల్లా, హర్యానా
నివాసం: హైదరాబాద్
కుటుంబం: డాక్టర్ హర్‌వీర్ సింగ్, ఉషా (తల్లిదండ్రులు); చంద్రాన్షు (సోదరి)
కోచ్‌లు: నానీ ప్రసాద్, ఆరిఫ్, భాస్కర్ బాబు, అతీక్ జౌహరి, ఇరియావన్, గోపీచంద్
పురస్కారాలు
అర్జున అవార్డు (2009), పద్మశ్రీ (2009), రాజీవ్ గాంధీ ఖేల్ రత్న (2010)

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+