For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాడ్మింటన్ సెమీస్: వాంగ్ ఇహాన్ చేతిలో సైనా ఓటమి

By Nageswara Rao
Saina Nehwal
లండన్, ఆగస్టు 3: లండన్‌ ఒలింపిక్స్‌లో భాగంగా వెంబ్లీ ఎరీనాలో జరిగిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్స్‌లో భారత్ షట్లర్ సైనా నెహ్వాల్, చైనాకు చెందిన వాంగ్ ఇహాన్ చేతిలో పరాజయం పాలయింది. 20 నిమిషాల పాటు జరిగిన తొలి రౌండ్‌లో సైనా నెహ్వాల్‌ పై వాంగ్ ఇహాన్ 21-13 పాయింట్లు సాధించి పైచేయి సాధించింది.

రెండో రౌండ్‌లో సైనా నెహ్వాల్, వాంగ్ ఇహాన్‌కు గట్టి పోటి ఇచ్చినప్పటికీ అద్భుతమైన షాట్లతో సైనాపై విరుచుకపడి 21-13తో విజయాన్ని సాధించింది. దీంతో లండన్ ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ విభాగంలో సెమీ ఫైనల్స్ నుండి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ ఓటిమితో సైనా నెహ్వాల్ వరుసగా ఆరు సార్లు వాంగ్ ఇహాన్‌ చేతిలో ఓడిపోయింది. దీంతో కాంస్య పతకం కోసం ఆమె రేపు వాంగ్ జిన్‌తో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది.

ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్‌లో నెంబర్ వన్ స్దానంలో ఉన్న చైనా క్రీడాకారిణి వాంగ్ ఇహాన్‌తో, ఐదవ స్దానంలో ఉన్న సైనా నెహ్వాల్ తలపడడం సైనాకు ఓ సవాల్. గతంలో వాంగ్ ఇహాన్‌తో సైనా నెహ్వాల్ ఆడిన ఐదు గేమ్‌లలో వాంగ్ ఇహాన్ పై చేయి సాధించడం వాంగ్ ఇహాన్ కలసి వచ్చిన అంశం. ఈ ఏడాది టాప్‌ ఫామ్‌లో ఉన్న సైనా వరసగా 14 మ్యాచులు గెలిచినా ప్రపంచ నంబర్‌ వన్‌ ముందు మాత్రం తలవంచక తప్పలేదు.

ఐతే లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ ఈ పాత రికార్డుని చెరిపి వేసి ఎలాగైనా సరే వాంగ్ పై గెలవాలనుకున్నప్పటికీ అది జరగలేదు. క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సైనా 21-15, 22-20తో ఐదో సీడ్ టినె బాన్ (డెన్మార్క్)పై వరుస గేముల్లో గెలుపొందిన తర్వాత సైనా మాట్లాడుతూ సెమీస్‌కు చేరడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇదంతా కలలా ఉంది. మెగా ఈవెంట్‌లో బాన్ వంటి అత్యుత్తమ క్రీడాకారిణిపై నెగ్గడం ఆనందంగా ఉంది. తొలిగేమ్‌ను సునాయాసంగానే చేజిక్కించుకున్నా.. రెండోగేమ్‌లో బాన్ గట్టి పో టీనిచ్చింది. గేమ్ పాయింట్‌ను కాచుకుని మరీ విజయం సాధించానని చెప్పింది.

సైనా నెహ్వాల్ Vs వాంగ్ ఇహాన్ (0-5) Previous meetings:

Malaysia Open (14.1.2012) Yihan won 21-15, 21-16

BWF World Superseries Finals 2011 (18.12.2011) Yihan won 18-21, 21-13, 21-13

China Masters (16.9.2011) Yihan won 21-8, 21-12

Indonesia Open (26.06.2011) Yihan won 12-21, 23-21, 21-14

Thomas Uber Cup Finals 2010 (12.5.2010) Yihan won 14-21, 21-11, 21-18

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+