Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రికార్డుల కశ్యప్: స్పాన్సరర్ల కోసం ఎదురుచూపులు

Parupalli Kashyap
హైదరాబాద్, సెప్టెంబర్ 7: లండన్ ఒలింపిక్స్‌ లాంటి మెగా టోర్నమెంట్లో రాణించినా కార్పోరేట్ సంస్దలు పట్టించుకోవడం లేదని హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తెలిపాడు. ఇంతకు ముందు అతనికి స్పాన్సర్‌గా వ్యవహరించిన ఓ కార్పోరేట్ సంస్థ ఏడాది క్రితమే తమ కాంట్రాక్టును ముగించుకోవడంతో కశ్యప్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

లండన్ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరడంతో ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయినా కశ్యప్‌కు ఆర్దిక సహాయం అందించే వాళ్లే లేకుండా పోయారు. అంతర్జాతీయ టోర్నీలు ఆడాలంటే కార్పోరేట్ సంస్దలు కచ్చితంగా సాయం అందించాలి. ప్రస్తుతం మాకు అందుతున్న సాయం అంతర్జాతీయ స్దాయిలో రాణించడానికి సరిపోదు.

స్పాన్సర్ల లేమి నా ఆటతీరుపై ప్రభావం చూపుతోంది. వచ్చే ఒలింపిక్స్ వరకేమో గానీ... బ్యాడ్మింటన్‌ తర్వాత మా భవిష్యత్ ఏమిటో తెలియని పరిస్దితి. ఇది కేవలం నా ఒక్కడి సమస్య కాదు. బ్యాడ్మింటన్ ఆడుతున్న అందరి ఆటగాళ్లది! ఎలా ఆడాలి... ఎలా వెళ్లాలనే ప్రశ్నలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి' అని ప్రపంచ 19 ర్యాంకు ఆటగాడు కశ్యప్ వాపోయాడు.

తన దగ్గర డబ్బు సంపాదించే ఇతరత్రా మార్గాలేవీ లేవని, ఒలింపిక్స్‌లో రాణించడం ద్వారా కార్పొరేట్ సంస్థల ప్రోత్సాహాన్ని ఆశిస్తున్నానని చెప్పాడు. విచిత్రమేమిటంటే ప్రస్తుతం భారత్‌లో బ్యాడ్మింటన్ క్రీడకు ఆదరణ పెరుగుతోంది. దాంతో పాటే వివిధ టోర్నీల్లో ప్రైజ్‌మనీ మొత్తం కూడా ప్రతి సంవత్సరం భారీగా పెరుగుతున్నా... ఆటగాళ్ల పరిస్థితి మాత్రం నానాటికి దారుణంగా మారిందని త్వరలో చైనా ఓపెన్ ఆడేందుకు వెళ్లనున్న కశ్యప్ అక్కడ సత్తాచాటేందుకు సిద్ధమయ్యానని చెప్పాడు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+