
శ్రీకాంత్ రెండు వరుస గేముల్లో సితికోమ్‌ను 21 - 14, 21 -18 స్కోరుతో ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాడు. బోన్సాక్ పోన్సన, విష్ను యులి ప్రసిత్యోల మధ్య జరిగే పోరులో గెలిచే ఆటగాడితో ఫైనల్లో శ్రీకాంత్ తలపడుతాడు.
శుక్రవారంనాడు భారత యువ షట్లర్ కె.శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీస్ చేరి సంచలనం సృష్టించాడు. 20 ఏళ్ల శ్రీకాంత్ ఇక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్స్ పోరులో వాగ్ హు సన్ (దక్షిణకొరియా)పై 21-17, 21-18తో వరుస రెండు గేముల్లో ఘన విజయం సాధించాడు.
థాయ్‌లాండ్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టోర్నమెంట్‌లో మహిళా సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకోవాలన్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆశలు వమ్మైన విషయం తెలిసిందే. ఈ టోర్నీకి చైనా టాప్ సీడ్స్ దూరమైనా సైనా ఫైనల్ చేరడంలో విఫలమై అనూహ్యంగా క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టింది. టాప్ సీడ్ సైనా క్వార్టర్స్‌లో సింగపూర్ షట్లర్ జువాన్ గు చేతిలో 21-13, 12-21, 18-21తో పరాజయం చవి చూసింది.
ఎనిమిదో సీడ్ జువాన్‌తో తలపడ్డ ఆరుసార్లలో సైనాకు ఇదే తొలి ఓటమి. తొలి గేమ్‌లో సైనాకు అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. అయితే ప్రపంచ నెం.23 జువాన్ కీలక రెండో గేమ్‌లో పుంజుకుంది. ప్రపంచ నెం.2 సైనా ఈ గేమ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోయింది.