అసభ్య వ్యాఖ్యలు: ఫ్యాన్స్‌పై జ్వాలా గుత్తా గుస్సా
బెంగళూర్: ఐబియల్ క్రిష్ ఢిల్లీ స్మాషర్స్ ఐకాన్ ప్లేయర్ జ్వాలా గుత్తా అభిమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అభిమానులు ఆమెపై అసభ్యకరమైన, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంతో ఆమె తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి గురైనట్లు చెబుతున్నారు. ఆదివారం రాత్రి శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచులో బంగా బీట్స్‌తో మ్యాచును జ్వాలా జట్టు టై చేసింది. ఈ సందర్భంగా ఆ సంఘటన చోటు చేసుకుంది.
వి దిజుతో కలిసి 29 ఏళ్ల జ్వాలా గుత్తా మిక్స్‌డ్ డబుల్స్ రబ్బర్ గెలిచింది. దాంతో అతిథ్య జట్టుతో 4-1 స్కోరుతో టై చేసుకుంది. మ్యాచ్ సందర్భంగా జ్వాలా గుత్తాపై ప్రేక్షకులు ఆమెను గేలి చేస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.

కొంత మంది జ్వాలా గుత్తాపై వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేశారని, అందుకే ఆమెకు ఆగ్రహించిందని జట్టు వర్గాలు సోమవారంనాడు చెప్పాయి. టై చేసిన తర్వాత జ్వాలా గుత్తా కోపంగా కనిపించింది. కొంత మంది అధికారులతో ఆగ్రహిస్తూ వాదులాటకు దిగింది.
సెమీస్ అవకాశాల్ని కాపాడుకోవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో బంగా బీట్స్ ఓడిపోగా, రేసు నుంచి దాదాపుగా వైదొలిగిన క్రిష్ ఢిల్లీ స్మాషర్స్ విజయం సాధించింది. బంగా మరో మ్యాచ్ ఆడాల్సివుంది. బంగా కెప్టెన్ పారుపల్లి కశ్యప్ జట్టుకు శుభారంభమందించినా, ఆ తర్వాతి మూడు మ్యాచ్‌లో సహచరులు నిరాశపరచడంతో ఓటమి తప్పలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications