Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నితిన్ ఆటపటిస్తున్నారనుకున్నా: 'ప్రత్యేకం'తో గుత్తా షేక్

Jwala Gutta
హైదరాబాద్: సినిమాలో ఓ పాట చేయమని అడిగితే తొలుత తాను సరదాగా ఆటపట్టించేందుకు జోక్ చేస్తున్నారేమోనని అనుకున్నానని కానీ, పాట విన్నాక తనకు చేయాలనిపించిందని బ్యాడ్మిండన్ క్రీడాకారణి గుత్తా జ్వాల మంగళవారం చెప్పారు. సినిమాల్లో నటించేందుకు గుత్తా జ్వాలా కొంతకాలంగా ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఆమె సినిమాల్లో నటించే ఆసక్తి ఉందని గతంలో చెప్పినప్పటికీ నటిస్తుందా? లేదా? అనే చర్చ జరిగింది.

ఆ చర్చకు గుత్తా జ్వాల ఫుల్ స్టాప్ పెట్టించారు. గుత్తా జ్వాల ఎటువంటి హంగామా లేకుండా సినిమా షూటింగు కానిచ్చేస్తోంది. నితిన్ హీరోగా రూపొందుతున్న చిత్రం గుండె జారి గల్లంతయ్యిందే. ఈ చిత్రంలో ఓ పాటలో గుత్తా జ్వాల కనిపించనుంది. తనకు అవకాశం ఎలా వచ్చిందన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

హీరో నితిన్, నిర్మాత నిఖితా రెడ్డి ఇద్దరూ తనకు మంచి స్నేహితులని, తమ సినిమాలో ఓ పాట చేయాలని అడిగారన్నారు. అయితే వారు తనతో జోక్ చేస్తున్నారని తొలుత అనుకున్నానని, ఆ తర్వాత పాట విని ఒప్పుకున్నానని చెప్పారు. తొలి రోజు షూటింగ్‌లో కొద్దిగా భయమేసిందని, సెట్‌లో చాలామంది ఉన్నారని చెప్పారు.

అంతమంది మధ్య డాన్స్ చేయడం తనకు కొత్త అనుభవాన్ని ఇచ్చిందన్నారు. ఈ నృత్యాల కోసం వారం రోజుల పాటు రిహార్సల్స్ చేశానని చెప్పారు. ఏదేమైనా ఇది చాలా సరదాగా ఉందని జ్వాలా చెప్పారు. సినిమాలలో నటిస్తున్నప్పటికీ తన తొలి ప్రాధాన్యం బ్యాడ్మింటన్‌కేనని జ్వాల స్పష్టం చేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+