ప్యాడ్ కట్టిన హాట్ బ్యూటీ గుత్తాజ్వాలా, సైనా సై(పిక్చర్స్)
హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్లు బ్యాట్ పట్టారు. సైనా నెహ్వాల్, జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప తదితరులు కాళ్లకు క్రికెట్ ప్యాడ్లు కట్టుకొని, చేతికి గ్లోవ్స్ వేసుకొని అలరించారు! ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబిఎల్) కోసం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో వారు ప్యాడ్లు, గ్లోవ్స్, క్రికెట్ బ్యాట్స్‌తో దర్శనమిచ్చారు.
కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా క్రికెట్ బ్యాట్‌తో అలరించాడు. క్రికెట్లో క్యాచ్‌లు సాధన చేసినట్లుగా.. క్రికెట్ బ్యాట్‌తో షటిల్స్‌ను కొడుతూ క్యాచ్‌లు అందించాడు. సైనా, జ్వాలా, అశ్విని, గోపీచంద్.. ఇలా అందరు బ్యాడ్మింటన్ స్టార్లు కాసేపు క్రికెటర్లుగా మారారు. ఆగస్టు 14వ తేదిన ఐబిఎల్ ప్రారంభం కానుంది.
ఐబిఎల్‌కు విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశ్యంలో భాగంగా సైనా, జ్వాలా, అశ్విని, గోపీచంద్‌లతో ప్రత్యేక ప్రకటనలను రూపొందిస్తున్నారు. బుధవారం అకాడమీలో ప్రచార ప్రకటనలను చిత్రీకరించారు. ప్రకటనలు ఆసక్తికరంగా ఉంటాయని సైనా చెబుతోంది.

ఇండియన్ బ్యాట్మింటన్ లీగ్(ఐబిఎల్) కోసం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ప్యాడ్లు కట్టి, చేతిలో హెల్మెట్ పట్టిన జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప

ఐబిఎల్ ప్రచార ప్రకటనలో భాగంగా అకాడమీలో క్రికెట్ ప్యాడ్లు, గ్లోవ్స్‌తో పాటు తన షటిల్ బ్యాట్‌ను పట్టుకున్న సైనా నెహ్వాల్.

ఎప్పుడు హాట్ హాట్‌గా కనిపించే జ్వాలా గుత్తా అకాడమీలో ప్యాడ్స్, గ్లోవ్స్ ధరించి ఉన్న దృశ్యం

ప్రకటనలో భాగంగా అకాడమీలో మరో స్టార్ షట్లర్ అశ్విని పొన్నప్ప
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications