
తమ కనీస ధరను తగ్గించారని కూడా తమకు సమాచారమివ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల డబుల్స్ తీసేసి అదనంగా మరో పురుషుల సింగిల్స్ మ్యాచ్ చేర్చారని, ఇది తమకు ఆలస్యంగా తెలిసిందని తాను నిరాశ చెందానని గుత్తా జ్వాల చెప్పారు.
కాగా ఐబిఎల్ వేలంలో గుత్తా జ్వాల, అశ్వినిలు తక్కువ ధర పలికారు. వారి విషయంలో గందరగోళం నడిచింది. వీరిద్దరికి మొదట దిగ్గజ హోదా ఇచ్చిన ఐబిఎల్ నిర్వాహకులు.. కనీస ధరను రూ.30 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఐబిఎల్‌లో మహిళల డబుల్స్ ఈవెంటును తొలగించి, అదనంగా సింగిల్స్‌ను చేర్చిన నేపథ్యంలో జ్వాల, అశ్వినిల ప్రాధాన్యత తగ్గిపోయింది.
దీంతో వారిని రూ.30 లక్షలు పెట్టి కొనడానికి ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు. షాక్ తిన్న నిర్వాహకులు అప్పటికప్పుడు నిబంధనలు మార్చారు. వారి కనీస ధరను రూ.15 లక్షలకు తగ్గించారు. అదే సమయంలో జ్వాలా, అశ్వినిలు నిరాశ చెందకుండా ఉండేందుకు ముప్పై లక్షల రూపాయల్లో ఫ్రాంఛైజీలు ఆ ధర లోపు కొంటే మిగతా మొత్తాన్ని చెల్లిస్తామని నిర్వాహకులు చెప్పారు.