Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తల్లిదండ్రులు, కోచ్ గోపీ సర్‌కి కృతజ్ఞతలు: సైనా నెహ్వాల్

Saina Nehwal
మీ భవిష్యత్తు ప్రణాళిక గురించి చెప్పమని ప్రశ్నించగా.. అది అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. లండన్ క్వార్టర్ పైనల్స్‌లో 33 సంవత్సరాల వయసు కలిగిన డెన్మార్క్ క్రీడాకారిణి టిన్ బౌన్‌పై విజయం సాధించాను. విజయాలు సాధిస్తుంటే తప్పక ఆటను కొనసాగిస్తానని చెప్పింది. బీజింగ్ ఒలంపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో నేను ఇంటికి రాగా.. ఈసారి కాంస్య పతకం సాధించాను. అలాగే పారుపల్లి కశ్యప్ మెరుగ్గా రాణించి క్వార్టర్ ఫైనల్స్‌కు వెళ్లగా, జ్వాలా- ద్విజు మంచి మ్యాచ్‌లను ఆడారు. రాబోయే ఒలంపిక్స్‌లో వీరు ఇంకాస్త మెరుగ్గా రాణిస్తారు.

సైనా నెహ్వాల్ మెంటార్ మరియు కోచ్‌గా ఉన్న పుల్లెల గోపీ చంద్, సైనా నెహ్వాల్‌ని ప్రశంసలతో ముంచెత్తాడు. సైనా ఆట విషయానికి వస్తే 100 శాతం తన ఫెర్పామెన్స్‌ని కనబర్చింది. ఏ ఒక్క సింగిల్ డేలో కూడా సైనా తన ప్రాక్టీస్‌ను మిస్ చేయలేదన్నాడు. ఏథెన్స్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ పైనల్స్‌లో ఇంటికి వచ్చిన మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ కాంస్య పతకం సాధించడం ఓ పెద్ద ఛాలెంజ్‌గా అభివర్ణించాడు. నా జీవితంలో నేను ఒలింపిక్ మెడల్ గెలుపొందలేదు.. కానీ ఇప్పుడు నాకు ఒలింపిక్ మెడల్ సాధించినంత ఆనందంగా ఉందన్నాడు.

సైనా నెహ్వాల్ తండ్రి హార్వీర్ సింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తన కూతురు సైనాని 'వెల్ డన్ సైనా' అంటూ అభినందించాడు. రాబోయే కాలంలో సైనా మరిన్ని పతకాలు సాధిస్తుందని చెప్పాడు. రాబోయే కాలంలో సైనా సాధించబోయే పతకం రంగు కూడా మారుతుందని చెప్పాడు. అంతక ముందు శంషాబాద్ విమానాశ్రయం నుండి ఓపెన్‌ టాప్‌ బస్‌లో సైనా నెహ్వాల్‌ని ఊరేగింపుగా తీసుకువస్తుండగా.. సైనా ఆనందంగా చేతులు ఊపుతూ అభిమానులకు సంకేతాలచ్చింది. ఆమెను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ప్రపంచ నెంబర్‌ టూ జిన్‌ వాంగ్‌ గాయం కారణంగా మ్యాచ్‌ నుంచి వైదొలగడంతో సైనాకు కాంస్యం దక్కింది.

సైనా నెహ్వాల్ వ్యక్తిగత రికార్డులు:

* భారత్‌కు ఒలింపిక్ పతకం సాధించిన రెండో మహిళ సైనా. తొలి పతకం కూడా రాష్ట్రానికే చెందిన కరణం మల్లీశ్వరి (వెయిట్‌లిఫ్టింగ్) 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో గెలిచింది.
* ఈ ఒలింపిక్స్‌లో హైదరాబాద్ క్రీడాకారులు ఇద్దరు కాంస్యాలు గెలిచారు.
* బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్‌కు తొలి ఒలింపిక్ సాధించిన ఘనత సైనాది.
* ఓవరాల్‌గా ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది పదో వ్యక్తిగత మెడల్.
* ఒలింపిక్స్‌లో భారత్ మూడు పతకాలు సాధించడం ఇది రెండోసారి.

సైనా వ్యక్తిగతం

పుట్టిన తేదీ, వయస్సు: 17 మార్చి, 1990 (22 ఏళ్లు)
జన్మస్థలం: హిస్సార్ జిల్లా, హర్యానా
నివాసం: హైదరాబాద్
కుటుంబం: డాక్టర్ హర్‌వీర్ సింగ్, ఉషా (తల్లిదండ్రులు); చంద్రాన్షు (సోదరి)
కోచ్‌లు: నానీ ప్రసాద్, ఆరిఫ్, భాస్కర్ బాబు, అతీక్ జౌహరి, ఇరియావన్, గోపీచంద్
పురస్కారాలు
అర్జున అవార్డు (2009), పద్మశ్రీ (2009), రాజీవ్ గాంధీ ఖేల్ రత్న (2010)

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+